
దీపావళి పండగను హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పండుగకు రెండు రోజుల ముందు దంతేరాస్.. ధనత్రయోదశి ( అక్టోబర్ 18) వస్తుంది. ఈ రోజున సాధారణంగా బంగారం.. వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 రాశుల వారు దంతేరాశి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏ రాశి వారు ఏ వస్తువులు కొనలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేష రాశి: ఈ రాశి వారు దీపావళి నాడు రాగి పాత్రలు.. పసుపురంగు కొవ్వొత్తులు.. బంగారం .. కొనుగోలు చేయడం మంచిది. వీటిని కొనుగోలు చేయడం వలన కెరీర్‌లో సక్సెస్‌తో పాటు అదృష్టం .. శ్రేయస్సు లభిస్తుంది. ఇంకా వీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి పురోగతి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారు వెండి గాజులు, వెండి చెంచా, వెండి పట్టీలు.. బంగారంతో లక్ష్మీదేవి రూపు ( బిళ్ల) .. వెండి గణపతిని కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని కొనుగోలు చేయడం వలన జీవితంలో ఆనందం .. ప్రశాంతత కలుగుతాయి .
మిధున రాశి: ఈ రాశి వారు దంతేరాస్ రోజున కాంస్య పాత్రలు కొనుగోలు చేస్తే వలన సకల శుభాలు కలుగుతాయి. ఇంకా బంగారం కొనుగోలు చేసి... పచ్చరత్నం కొంటే కెరీర్‌లో పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి:ఈ రాశి వారు మీ తల్లికి ముత్యాల సెట్, వెండి ఉంగరం కొని ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడవలన జీవితంలో శాంతి.. మరియు ప్రశాంతత లభిస్తాయి.
సింహం రాశి: ఈ రాశి వారు బంగారు గొలుసు, చెవిపోగులు .. పసుపు రంగు దీపం కొనాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇది మీ జీవితంలో శక్తిని కలుగజేస్తుంది.
కన్యారాశి: ఈ రాశి వారు శ్రీ యంత్రంతో పాటు రాగి పాత్రలు కొనుగోలు చేయాలి. ఆరోగ్యం.. శ్రేయస్సు.. ధనలాభం కలుగుతుంది.
తులారాశి: ఈ రాశి వారు వెండి కళ్లజోడు, రాధా కృష్ణ విగ్రహం .. కొనాలి. ఇది మీ జీవితంలో ప్రేమ .. సామరస్యం కలుగజేస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు బంగారు ఉంగరం, చెవిపోగులు, హనుమంతుడి విగ్రహం కొనుగోలు చేయడం వలన ... మీకుశత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆధ్యాత్మిక గ్రంథాలు ( రామాయణం.. మహాభారతం) వంటి పుస్తకాలు కొనాలి. ఇది జీవితంలో సామరస్యాన్ని పెంచుతుంది
మకర రాశి : ఈ రాశి వారు వెండి గాజులు, మనీ ప్లాంట్ మొక్క , ఇత్తడి పాత్రలు కొనాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. దీనివలన ఆర్దిక ఇబ్బందులు తొలగుతాయి.
కుంభ రాశి: ఈ రాశి వారు తులసి మొక్కను మట్టి కుండీలో నాటాలి. అలానే వెండి హనుమంతుడి విగ్రహాన్ని తీసుకురావాలి. ఇది జీవితంలో మంచి ఆరోగ్యంతో పాటు శ్రేయస్సును కలుగజేస్తుంది.
మీన రాశి : ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడాని చేపల తొట్టి, గణేశ విగ్రహంకొనుగోలు చేయాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.