పాక్ ఆర్మీ చీఫ్ తర్వాత ఎయిర్ చీఫ్.. అమెరికాలో అసలు ఏం జరుగుతోంది?

 పాక్ ఆర్మీ చీఫ్ తర్వాత ఎయిర్ చీఫ్.. అమెరికాలో అసలు ఏం  జరుగుతోంది?

గత పదేళ్లలో తొలిసారిగా పాకిస్తాన్ వైమానిక దళ అధిపతి తాజగా అమెరికాకు అధికారిక పర్యటన చేశారు.  ఈ పర్యటనలో భాగంగా ఆయన పెంటగాన్, స్టేట్ డిపార్ట్‌మెంట్, కాపిటల్ హిల్‌లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి ద్వైపాక్షిక రక్షణ సహకారం పెంపుపై చర్చించారు. 

అయితే ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విందు చేసిన కొన్ని వారాల తర్వాత అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటన జరిగింది. ఈ పర్యటన ఈ ప్రాంతం అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యతలలో పునసమీక్షను సూచిస్తుంది. అయితే కొంత అస్పష్టత ఉన్నప్పటికీ, ఈ రెండు పర్యటనలు అమెరికా పాకిస్తాన్ సైనిక స్థాపనతో లోతైన సంబంధాన్ని కోరుకోవచ్చని సూచిస్తున్నాయి.  

ALSO READ | రష్యా నుంచి ఆయిల్ కొంటే 500 శాతం టారిఫ్‌‌‌‌ వేస్తాం

అమెరికా-పాక్ సంబంధాల  వెనుక కారణం ఏమిటి:  గత దశాబ్దంలో ఎక్కువ కాలంగా అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు శాంతియుతంగా ఉన్నాయి.  చైనాకు ప్రతికగా అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహానికి కీలకమైన దేశంగా భారతదేశం ఎదగడంతో, అమెరికా దృష్టి ఎక్కువగా భారతదేశం వైపు మళ్లింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాతో ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ద్వారా సైనిక, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం అమెరికా లక్ష్యాలకు భిన్నంగా మారింది.

క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వాషింగ్టన్ పర్యటనకు ముందే అమెరికా కీలక సంస్థలలో ఎయిర్ చీఫ్ మార్షల్ సిద్ధూను ఆతిథ్యం ఇవ్వడం ఆశ్చర్యం కంటే ఎక్కువే కనిపిస్తోంది. పాకిస్థాన్ సైన్యం ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (IS-K) ఉగ్రవాద సంస్థపై తమ కార్యకలాపాలను పెంచింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈ సంస్థ పెరగడం, పాకిస్థాన్‌లోకి విస్తరించడం పాకిస్థాన్‌తో పాటు అమెరికాకు కూడా ఆందోళనగా మారింది.

ALSO READ | మూడో ప్రపంచ యుద్ధానికి చైనా రెడీ అవుతోందా : పెంటగాన్ కంటే 10 రెట్ల పెద్ద ఆర్మీ సిటీ నిర్మాణం ఎందుకు..?

ట్రంప్‌తో మునీర్ సమావేశం గురించి వార్తలు, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా సైనిక చర్య గురించి చర్చలు జరిగాయన్న సూచనలు, ఈ పరిణామాలకు మరో కోణాన్ని చూపిస్తున్నాయి. టెహ్రాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, రవాణా మార్గాలు, వైమానిక స్థలంపై దానికున్న పట్టు అమెరికాకు తప్పనిసరి భాగస్వామిగా మార్చింది.

 భారతదేశం ఎందుకు ఆందోళన చెందాలి అంటే  భారతదేశం దృష్టిలో అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు తిరిగి బలపడటం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే భారతదేశం చాలా కాలంగా అమెరికాతో ఒక ప్రత్యేక అనుసంబంధాన్ని కోరుకుంటోంది, ముఖ్యంగా రక్షణ సహకారం, సాంకేతిక మార్పిడి వంటి అంశాల్లో. ఒకవేళ అమెరికా ప్రాంతీయ సైనిక వ్యవహారాల్లో పాకిస్తాన్‌ను భారతదేశంతో సమానంగా చూడటం ప్రారంభిస్తే భారతదేశ ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది.

  పాకిస్తాన్ పౌర సంస్థలు బలహీనపడి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నందున, ముఖ్యంగా సైన్యానికి అమెరికా మద్దతు పునరుద్ధరించబడితే, పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థలో సైన్యం ఇంకా వైమానిక దళం  మరింత బలపడే ప్రమాదం ఉంది. ఈ మద్దతుతో మరింత ధైర్యంగా  పాకిస్తాన్ సైన్యం భారతదేశం పట్ల, ముఖ్యంగా కాశ్మీర్ లేదా నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరింత చురుగ్గా  వ్యవహరించవచ్చు. 

భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ వైమానిక దళ అత్యున్నత అధికారి ఇద్దరితోనూ దాదాపు ఒకే సమయంలో అమెరికా సంప్రదింపులు జరపడం, భారతదేశంతో వ్యూహాత్మక సంబంధాలకు ఇంకా ఇండో-పసిఫిక్ వ్యూహానికి అమెరికాకున్న నిబద్ధతపై కొన్ని సంకేతాలను పంపుతోంది.  భారతదేశ పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇండో-పసిఫిక్ సముద్ర భద్రతలో కీలక పాత్ర కారణంగా, అమెరికా ప్రపంచ వ్యూహంలో భారతదేశం ఒక తప్పనిసరి భాగస్వామిగా ఉంది. అయితే, అమెరికా మద్దతు ఉన్న పాకిస్తాన్ సైన్యం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉండటంతో  భారతదేశం కూడా తీవ్ర పోటీతో సిద్ధంగా ఉండాలి.