షుగర్, బీపీ, లావుగా ఉన్న అమెరికా వీసా ఎందుకు ఇవ్వరు.. కారణాలు ఏంటీ.. దీని వెనక ఉద్దేశం ఏంటీ..?

షుగర్, బీపీ, లావుగా ఉన్న అమెరికా వీసా ఎందుకు ఇవ్వరు.. కారణాలు ఏంటీ.. దీని వెనక ఉద్దేశం ఏంటీ..?

డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్ వంటి అనారోగ్యం లేదా జబ్బుతో బాధపడుతున్న వారికీ  ఇప్పుడు అమెరికా వెళ్లడం మరింత కష్టం కావొచ్చు. ఎందుకంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని అమెరికా వచ్చేందుకు  లేదా ఉండటానికి అనుమతించవద్దని అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా అంబాసి ఆఫీసులు, కాన్సులేట్‌లను ఆదేశించింది.

ఈ రూల్ 'పబ్లిక్ ఛార్జ్' విధానంపై ఆధారపడి ఉంటుంది, అలాగే  US ప్రభుత్వ వనరులపై ఆధారపడే వలసదారులను నిరోధించేందుకు తీసుకొచ్చారు. వీసా అధికారులు వీసా దరఖాస్తుదారుల  వయస్సు, ఆర్థిక స్థితితో పాటు ఆరోగ్యం కూడా పరిశీలించాలని  సలహా ఇచ్చింది. అంటే భవిష్యత్తులో ఒక వ్యక్తి ఖరీదైన వైద్యం లేదా  ట్రీట్మెంట్ కోసం అమెరికా  ప్రభుత్వ సహాయంపై ఆధారపడే అవకాశం ఉంటే, వారి వీసా రిజెక్ట్ అవుతుంది.

NRIలు, వలసదారులు, అమెరికా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు  ప్రభుత్వానికి భారమా కాదా అని వీసా అధికారులు నిర్ణయిస్తారు. వీసా దరఖాస్తుదారుడి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం అని అధికారులకు ఇచ్చిన అర్దర్లో కూడా  స్పష్టంగా పేర్కొంది. గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, జీవక్రియ వ్యాధులు, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి వైద్యం కోసం లక్షలు ఖర్చయ్యే ట్రీట్మెంట్ అవసరం కావొచ్చు. 

దీనికి తోడు అధికారులు ఊబకాయం వంటి ఆరోగ్య పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు, ఎందుకంటే ఊబకాయం వల్ల  ఉబ్బసం, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు(హై బిపి) వంటి సమస్యలను కలిగిస్తుంది. కొత్త ఆదేశాల ప్రకారం, ఒక వలసదారుడు లేదా వీసా పై అమెరికా వెళ్లే వ్యక్తి  'public charge'గా అవుతాడా... అంటే ప్రభుత్వ వనరులపై భారం అవుతుందా..  వారికి ఖరీదైన దీర్ఘకాలిక వైద్య  సంరక్షణ అవసరమా అని అధికారులు నిర్ణయించాలి.

సమాచారం ప్రకారం ప్రభుత్వ సహాయం లేకుండా, ప్రభుత్వం పై ఆధారపడకుండా ఒక వీసా దరఖాస్తుదారుడు జీవితాంతం అమెరికాలో తన వైద్య ఖర్చులను స్వయంగా భరించగలడా అని వీసా అధికారులు చెక్ చేస్తారు.అంతేకాదు పిల్లలు లేదా వృద్ధ తల్లిదండ్రుల సహా  కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 

వీసా ఆఫీసర్ ఎం చెక్  చేస్తారు అంటే :ఇంతకుముందు  వీసా ప్రాసెస్ లో అంటు వ్యాధుల అంటే TB, HIV చెకింగ్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మొత్తం  మీ అనారోగ్య పూర్తి చరిత్ర అడుగుతారు. 

1.మీ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చవుతుంది?

2.ప్రభుత్వ సహాయం లేకుండా జీవితాంతం ట్రీట్మెంట్  తీసుకోవచ్చా ?

3.మీ పిల్లకి  ఏదైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమా ? మీరు పని చేయగలరా?

4.మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారా? వారు మీతోనే ఉంటారా? వంటివి అడుగుతారు. 

కొత్త రూల్ వల్ల ఎవరి పై  ఎఫెక్ట్ ఉంటుందంటే :  ఈ రూల్  విజిటింగ్ వీసా, టూరిజం, ట్రావెలింగ్ లేదా స్టూడెంట్ వీసా వంటి తాత్కాలిక వీసా ఉన్నోళ్లకి కూడా వర్తిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. సాంకేతికంగా చూస్తే  ఈ రూల్ మొత్తం అందరు వీసా దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. వీరిలో B-1/B-2 (పర్యాటక లేదా వ్యాపారం), F-1 (స్టూడెంట్) వీసాలకు దరఖాస్తు చేసుకునే వారు కూడా ఉన్నారు.

ట్రంప్ ప్రభుత్వం  2019లో 'పబ్లిక్ ఛార్జ్' రూల్ కఠినతరం చేస్తూ, మన సమాజానికి ఉపయోగపడే వాళ్ళని మాత్రమే అంగీకరిస్తాము అని చెప్పింది. ఈ రూల్  వలసదారులపై, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రభావం చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రూల్ వీసా రిజెక్షన్స్ పెంచడమే కాకుండా హెల్త్ కేర్ సేవలను పొందడంపై  ప్రభావాన్ని సృష్టిస్తుంది.

1. వీసా & గ్రీన్ కార్డ్ రిజెక్షన్ :

ట్రంప్ తొలి రూల్  వల్ల  47 లక్షల  మెడికైడ్/CHIP లబ్ధిదారులు కవరేజీని కోల్పోయారు. ఇప్పుడు, మధుమేహం (భారతదేశంలో 10 కోట్లకు  పైగా ప్రభావితం చేస్తున్నది) లేదా ఊబకాయం ఉన్న భారతీయ/ఆసియా వలసదారులు వీసాలు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. H-1B, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా మరింత కష్టం  కావచ్చు.ఇంకా వృద్ధ తల్లిదండ్రులు లేదా వికలాంగ పిల్లలు ఉన్న కుటుంబాలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది.


2. ఆరోగ్య సేవలకు దూరంగా: 

2019 రూల్ ప్రకారం 7 వలస కుటుంబాలలో 1 కుటుంబంకి  అర్హత ఉన్నప్పటికీ మెడికైడ్, SNAP (ఆహార సహాయం) లేదా గృహ ప్రయోజనాలను వదులుకోవలసి వచ్చింది. ఈ రూల్ అనారోగ్యాలను దాచడానికి ప్రజలు చికిత్సకు దూరంగా ఉండటానికి దారితీస్తుంది, ఇంకా అనారోగ్యాలను మరింత తీవ్రం  చేస్తుంది.

3. పిల్లలపై ప్రభావం:

మొత్తం కుటుంబ ఆరోగ్య చరిత్ర పరిశీలిస్తారు కాబట్టి, వలస వచ్చిన తల్లిదండ్రులు అమెరికాలో పిల్లలు ప్రయోజనాలను పొందేందుకు అనుమతించలేకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు లేదా డెలివరీ  లేదా నివారణకు దూరంగా ఉండాల్సి వస్తుంది అంటే తల్లి/శిశు మరణాల రేటును పెంచుతుంది.

4. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:

అమెరికా శ్రామిక శక్తిలో వలసదారులు ఎక్కువ. ఈ రూల్ వల్ల ఆరోగ్యం సరిగా లేని స్కిల్స్   ఉన్న కార్మికుల సంఖ్య అంటే ఐటి నిపుణులు వంటివారిని తగ్గుతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయితే,  ప్రభుత్వ డబ్బు  ఆదా అవుతుందని ట్రంప్ గవర్నమెంట్ పేర్కొంది.

20-30% భారతీయ వీసాలు తిరస్కరించే ఛాన్స్ : 

ట్రంప్ ప్రభుత్వం 2025 'public charge' రూల్ భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే  ప్రతి ఏడాది దాదాపు 1 లక్ష  మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేసుకుంటారు, వీరిలో 70% కంటే ఎక్కువ మంది ఐటీ, హెల్త్‌కేర్ వంటి రంగాలకు చెందిన H-1B వీసా హోల్డర్లు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నియమం భారతీయ దరఖాస్తుల వీసా రిజెక్షన్ రేటును 20-30% పెంచుతుంది, ముఖ్యంగా అధిక జీతం ఉన్న ఉద్యోగాలు పొందలేని మధ్యతరగతి నిపుణులకు. డయాబెటిస్ ఉన్న భారతీయ ఇంజనీర్ అలాగే  వృద్ధ తల్లిదండ్రులు బలమైన స్పాన్సర్ ఉన్నప్పటికీ రిజెక్షన్ ఎదుర్కోవలసి రావచ్చు. ఇది కుటుంబం విడిపోవడాన్ని పెంచుతుంది.

భారతదేశంలో అత్యధిక సంఖ్యలో డయాబెటిస్ కేసులు ఉన్నాయి. పంచవ్యాప్తంగా 53 కోట్ల  మంది మధుమేహంతో బాధపడుతున్నారు, అలాగే 2045 నాటికి 78 కోట్లకు పెరుగుతారని  అంచనా. ఇందులో భారతదేశం నంబర్ వన్ దేశం, తరువాత చైనా (2030లో 14 కోట్లు) ఉంది.

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) ప్రకారం, భారతదేశాన్ని "ప్రపంచ మధుమేహ రాజధాని" అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ అత్యధిక సంఖ్యలో డయాబెటిస్ కేసులు ఉన్నాయి. 2019లో భారతదేశంలో 7 కోట్ల పెద్దలకు డయాబెటిస్ ఉంది, అలాగే 2021 నాటికి సుమారు 10 కోట్లకు పెరిగింది.

డయాబెటిస్ అట్లాస్ 2025 (11వ ఎడిషన్) ప్రకారం, భారతదేశంలో డయాబెటిస్ ఉన్న పెద్దల సంఖ్య (20-79 సంవత్సరాలు) 2024 నాటికి 10 కోట్లకు దాటి ఉంటుందని, 2045 నాటికి 13.42 కోట్లు చేరుకుంటుందని అంచనా.
 
గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, న్యూరోలాజికల్ వ్యాధులు, మానసిక సమస్యలు, ఊబకాయం, వైకల్యం అంటే ఇతరులపై ఆధారపడటం వంటి వ్యాధులతో  బాధపడుతుంటే అమెరికా వీసా మంజూరు చేయదు. H-1B పొందడంలో భారతీయులు 73%తో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. తరువాత చైనా 12%, ఫిలిప్పీన్స్ 11%, కెనడా 1%, దక్షిణ కొరియా 1%, ఇతర దేశాలు 12%తో ఉన్నాయి.