పవిత్ర కార్తీక మాసంలో ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. వరుస సెలవులతో పెద్ద ఎత్తున భక్తులు వాయులింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
నవంబర్ 9న ఉదయం విదేశీ మహిళలు చీర కట్టులో సందడి చేశారు. ఆకట్టుకునే రీతిలో చక్కటి చీరకట్డులో క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకున్నారు. జర్మని, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా కు చెందిన సుమారు 30 మంది విదేశీ మహిళలు ముక్కంటిని దర్శించుకున్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు తగ్గట్టుగా చీర కట్టులో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం విశేషం.
