పొల్యూషన్‌తో చచ్చిపోతున్నాం.. పట్టించుకోరేం.. ఇండియా గేట్ దగ్గర ఆందోళనకు దిగిన ఢిల్లీ ప్రజలు

పొల్యూషన్‌తో చచ్చిపోతున్నాం..  పట్టించుకోరేం.. ఇండియా గేట్ దగ్గర ఆందోళనకు దిగిన ఢిల్లీ ప్రజలు

ఢిల్లీలో గాలి విషపూరితం.. ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు.. మా పిల్లలు కాలుష్యం నుంచి కాపాడే వారే లేరా..? స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కూడా లేదా.. పర్యవేక్షణ కాదు కావాల్సింది.. మాకు జీవించే హక్కు కావాలి అంటూ  ప్లకార్డులు పట్టుకొని ఇండియా గేట్​ దగ్గర భారీ ఎత్తున నిరసనలు తెలిపారు ఢిల్లీ ప్రజలు. అయితే అనుమతి లేకుండా నిరసనల్లో పాల్గొన్నారు ఆందోళన కారులను అరెస్ట్​ చేశారు ఢిల్లీ పోలీసులు. 

ఆదివారం ( నవంబర్​9) ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎయిర్​  క్వాలిటి దారుణంగా పడిపోయింది.. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. ఎయిర్​ క్వాలిటీ 400AQI .. అయితే ప్రైవేట్​ ఎయిర్​ క్వాలిటీ ఇండెక్స్​ మాత్రం 999 చూపిస్తున్నాయి.. ఇంత దారుణంగా గాలి నాణ్యత పడిపోతుంటే పాలకులు ఏంచేస్తున్నారంటూ నిరసనలకు దిగారు ఢిల్లీ ప్రజలు. 

ఢిల్లా మాజీ సీఎం షీలా దీక్షిత్ హయంలో ఢిల్లీ గ్రీన్ క్యాపిటల్‌గా పేరు తెచ్చుకుంది.. కానీ ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల్లో కొటికగా నిలిచింది. బాధ్యత తీసుకోవాల్సిన రాజకీయ నేతలు బదులుగా ఒకరినొకరు నిందించు కోవడమే సరిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

ఆదివారం సాయంత్రం పర్యావరణ కార్యకర్తులతో కలిసి ఢిల్లీ ప్రజలు  ఇండియా గేట్ దగ్గర పెద్ద ఎత్తున గుమికూడారు. రైట్ టు లైవ్​ నాట్​ జస్ట్​ సరైవ్​ అని ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు. పాలకులను కలవాలని మేం శాంతి యుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్​ చేస్తున్నారని ఆందోళన కారులు ఆవేదన వ్యక్తం చేశారు.