ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 16.
ఖాళీలు: నర్సింగ్ ఆఫీసర్ 2,551. ఈ పోస్టుల్లో 80 శాతం మహిళలకు, 20 శాతం పురుషులకు రిజర్వ్ చేస్తారు.
ఎలిజిబిలిటీ: ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ (ఆనర్స్)/ బీఎస్సీ నర్సింగ్ లేదా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (పోస్ట్ -సర్టిఫికెట్) / పోస్ట్- బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌తోపాటు స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు & మిడ్‌వైఫ్‌గా నమోదు చేసుకోవాలి.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / బోర్డు లేదా కౌన్సిల్ నుంచి జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీలో డిప్లొమాతోపాటు స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సు & మిడ్ వైఫ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
నర్సింగ్ కోర్స్ పూర్తిచేసిన తర్వాత కనీసం రెండేండ్లు నర్సింగ్ వృత్తిలో అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 24.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు
లేదు.
లాస్ట్ డేట్: మార్చి 16.
స్టేజ్ I: ఎన్ఓఆర్సీఈటీ ప్రిలిమినరీ (సీబీటీ) ఏప్రిల్ 11.
స్టేజ్ II: ఎన్ఓఆర్సీఈటీ మెయిన్స్ (సీబీటీ) ఏప్రిల్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ప్రిలిమినరీ
ఇది కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి 80 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఓబీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా మరో 5 శాతం సడలింపు ఉంటుంది.
మెయిన్స్
ఈ పరీక్షలో 160 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మెయిన్‌లో అర్హత సాధించాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఓబీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా మరో 5 శాతం సడలింపు ఉంటుంది. ఎయిమ్స్ కేంద్రాలైన బఠిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్పూర్, దియోఘర్, గోరఖ్‌పూర్, జోధ్‌పూర్, కల్యాణి, మంగళగిరి, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పట్నా, రాయ్‌బరేలీ, రాయ్‌పూర్, రాజ్‌కోట్, రిషికేష్, విజయ్‌పూర్(జమ్మూకాశ్మీర్), అవంతిపురతోపాటు జిప్మర్- పుదుచ్చేరి, ఈఎస్ఐసీ, ఇతర కేంద్ర సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు.
