IPL 2027: ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉండగా, ముంబై ఇండియన్స్ (MI) జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ అంచనాల మధ్య రీ-ఎంట్రీ ఇచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడే అవకాశం ఉందన్న వార్తలు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. హార్దిక్‌ను సొంతం చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ లాంటి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అధికారిక రిటెన్షన్ లేదా ట్రేడింగ్ వివరాలు వెలువడే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2026లో ముంబై దారుణ ప్రదర్శన:
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026లో తీవ్రంగా నిరాశపరిచింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, తిలక్ వర్మ లాంటి స్టార్లతో నిండిన జట్టు ఉన్నప్పటికీ.. ముంబై కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన కూడా అత్యంత పేలవంగా కొనసాగింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 206 రన్స్ (సగటు 22.89) మాత్రమే చేసిన హార్దిక్, బౌలింగ్‌లోనూ కేవలం 4 వికెట్లు (సగటు 64.75) మాత్రమే తీసి తీవ్ర విమర్శలపాలయ్యాడు.
మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు?:
2024 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇస్తూ ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2020 తర్వాత ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు ఒక్కసారి కూడా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దీంతో జట్టును మళ్లీ విజయాల బాట పట్టించేందుకు, అలాగే ఫ్యాన్స్ లోని అసంతృప్తిని చల్లార్చేందుకు ఫ్రాంచైజీ మళ్లీ రోహిత్ శర్మకే నాయకత్వ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 2013 మధ్యలో పగ్గాలు చేపట్టి 5 టైటిళ్లు అందించిన రోహిత్ చేతికి మళ్లీ పగ్గాలు వెళ్తే ముంబై రాత మారుతుందనే చర్చ జోరుగా కొనసాగుతుంది.
ALSO READ : 33 ఏళ్లకు భారత జట్టులోకి ఛాన్స్..
🚨 ROHIT SHARMA IS BACK AS CAPTAIN 🚨
— India Sports Network (@IndiaSportsNet) July 28, 2026
Rohit Sharma is likely to be captain of MI again in IPL 2027. pic.twitter.com/nFO10JxaMw
