ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్ –-టెక్) విభాగంలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 125వ కోర్సు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ జులై 20న ప్రారంభమై ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటుంది.
పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్–టెక్) పురుషులు.
మొత్తం ఖాళీలు: 70.
విభాగాల వారీగా ఖాళీలు: జనరల్ (ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ హోల్డర్స్) 63, భారత సైనిక అమరవీరులు/ యుద్ధ బాధితుల సంతానం 7.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎన్‌సీసీ గ్రేడింగ్: ఎన్‌సీసీ సీనియర్ డివిజన్/ వింగ్‌లో కనీసం రెండు లేదా మూడేళ్లు సేవలు అందించి, సి సర్టిఫికెట్ పరీక్షలో కనీసం బి గ్రేడ్ సాధించి ఉండటం తప్పనిసరి.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ దశలో తాత్కాలిక ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ను అనుమతించరు.
బాటిల్ క్యాజువాల్టీస్ ప్రత్యేక కోటా
ఆర్మీ సిబ్బందికి చెందిన అవివాహిత సంతానం ఈ కోటా కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అభ్యర్థులకు ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం లేదు.
వయోపరిమితి: 2027, జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి . 2002, జనవరి 2 కంటే ముందు గానీ 2008, జనవరి 1 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 20.
లాస్ట్ డేట్: ఆగస్టు 20.
ఎస్ఎస్బీ షార్ట్ లిస్టింగ్: సెప్టెంబర్ మొదటివారం.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ: నవంబర్/ డిసెంబర్.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో 49 వారాలపాటు ప్రీ-–కమిషన్ శిక్షణ ఉంటుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి 'లెఫ్టినెంట్' హోదా ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు.
►ALSO READ | ఎయిమ్స్ల్లో నర్సింగ్ జాబ్లు.. 2 వేలకు పైగా ఖాళీలు.. శాలరీ ఎంతంటే..
