ఎయిమ్స్ల్లో నర్సింగ్ జాబ్లు.. 2 వేలకు పైగా ఖాళీలు.. శాలరీ ఎంతంటే..

ఎయిమ్స్ల్లో నర్సింగ్ జాబ్లు.. 2 వేలకు పైగా ఖాళీలు.. శాలరీ ఎంతంటే..

భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), న్యూఢిల్లీ నార్సెట్-11- 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య సంస్థల్లో 2,218 నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్-–బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్.
  • మొత్తం ఖాళీలు: 2216.

ఎలిజిబిలిటీ:

రూట్- I (డిగ్రీ అర్హత): భారతీయ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) లేదా రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి పోస్ట్- సర్టిఫికెట్/ పోస్ట్ -బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగి ఉండాలి. దీంతోపాటు స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌లో నర్స్, మిడ్‌‌‌‌వైఫ్‌‌‌‌గా రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
 

రూట్–II (డిప్లొమా, అనుభవం): గుర్తింపు పొందిన ఇన్‌‌‌‌స్టిట్యూట్/ బోర్డ్/ కౌన్సిల్ నుంచి జనరల్ నర్సింగ్ మిడ్‌‌‌‌వైఫ్ (జీఎన్ఎం) డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌లో నర్స్, మిడ్‌‌‌‌వైఫ్‌‌‌‌గా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. కోర్స్ పూర్తయి, ఫలితాలు వెలువడి, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పొందిన తరువాత కనీసం 50 పడకలు గల ఆసుపత్రిలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: జులై 24. 
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 3000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​లకు రూ.2400, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
  • లాస్ట్ డేట్: ఆగస్టు 13. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.aiimsexams.ac.in ను సందర్శించండి. 

నార్సెట్:
ఎయిమ్స్ నర్సింగ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే నార్సెట్ ఎంపిక ప్రక్రియను రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.

ప్రిలిమినరీ: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ పరీక్ష సమయం 90 నిమిషాలు. 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ నాలెడ్జ్ & ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు, నర్సింగ్ సబ్జెక్టుల నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఈ మార్కులను తుది మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకోరు.

మెయిన్స్: మెయిన్స్​లో నర్సింగ్ సిలబస్‌‌‌‌పై క్లినికల్ నైపుణ్యాలను పరీక్షించేలా కేస్-సినారియో ఆధారితంగా మొత్తం 160 మార్కులకు 160 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మెయిన్స్ లో సాధించిన మార్కుల ఆధారంగానే ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.

జీతభత్యాలు: ప్రాథమిక వేతనం రూ. 44,900 నుంచి ప్రారంభమై, సర్వీసును బట్టి రూ.78,800 వరకు ఉంటుంది.