ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయన్నారు.
పోస్టు పేరు: మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
మొత్తం ఖాళీలు: 389.
విభాగాల వారీగా ఖాళీలు
మేనేజర్: సివిల్ ఇంజినీరింగ్ 145, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 16, ఫైనాన్స్ 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, ఆర్కిటెక్చర్ 4, లా 2, ఫైర్ సర్వీసెస్ 14, ఆపరేషన్స్ 28, కమర్షియల్ 9, కార్పొరేట్ ప్లానింగ్ & మేనేజ్ మెంట్ సర్వీసెస్ 1, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ 2.
జూనియర్ ఎగ్జిక్యూటివ్: ఫైనాన్స్ 36, లా 6, ఆపరేషన్స్ 79, సర్వే & కార్టోగ్రఫీ 8.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ/ పీజీడీఎం/ కాస్ట్ అకౌంట్/ చార్టర్డ్ అకౌంటెంట్/ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, లా డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. మేనేజర్ పోస్టులకు మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 08.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయిపు ఉంటుంది. ఇతరులకు రూ.1000.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 7.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అప్లికేషన్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.aai.aero ను సందర్శించండి.
