నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) స్టీల్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.
మొత్తం ఖాళీలు: 102.
విభాగాల వారీగా ఖాళీలు: సిరామిక్స్ 3, కెమికల్ 4, సివిల్ 3, కంప్యూటర్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 4, ఎలక్ట్రికల్ 22, ఫైనాన్స్ 7, హ్యూమన్ రిసోర్సెస్ 3, ఇనుస్ట్రుమెంటేషన్ 2, మెకానికల్ 51, మెటలార్జీ 3.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం అగ్రిగేట్ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 22.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఆగస్టు 18.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (70 శాతం వెయిటేజీ), గ్రూప్ డిస్కషన్ (15 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ (15 శాతం వెయిటేజీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.nsltd.inను సందర్శించండి.
