హైదరాబాద్‌లో ఈడీ సోదాలు: అమెరికన్లు టార్గెట్ గా సైబర్ మోసాలు..ప్రధాన నిందితుడు అరెస్ట్

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు: అమెరికన్లు టార్గెట్ గా సైబర్ మోసాలు..ప్రధాన నిందితుడు అరెస్ట్

హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత సోదాలు నిర్వహించి, విదేశీ పౌరులను ముఖ్యంగా అమెరికన్లను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కీలక నిందితుడు వికాస్ నిమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వికాస్ నిమార్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పన్ను బకాయిలు, రుణ బకాయిలు ఉన్నాయంటూ అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయం ఉందంటూ బెదిరింపులకు పాల్పడుతూ భారీ మోసాలకు తెగబడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరాల ముఠా గుట్టును ఈడీ రట్టు చేసింది.

ఇప్పటికే నాల్గు నెలల క్రితం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. సైబరాబాద్ పోలీసులు, సీబీఐ ఢిల్లీ టీమ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ కొనసాగుతోంది. 

►ALSO READ | కబ్జాదారులే కోర్టుకెళ్తున్నారు... ఆక్రమణలపైనే హైడ్రా చర్యలు: హైకోర్టు ఆదేశాలపై సీఎం రేవంత్

ఇందులో భాగంగానే హైదరాబాద్ ఈడీ అధికారులు అహ్మదాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మహమ్మద్ అన్సారీ అలియాస్ మొహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీ, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచీ, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రవాల్, ప్రదీప్ వి. రాథోడ్‌లను నిందితులుగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు.