- ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల కంట్రోల్ రూం
న్యూఢిల్లీ, వెలుగు: మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ చిక్కుకున్న రాష్ట్ర పౌరులకు అవసరమైన సహాయం అందించాలని, వారి యోగక్షేమాలను పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఆయా దేశాల్లోని పరిస్థితులను పర్యవేక్షించేందుకు నలుగురు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రయాణ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలం గాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తారు.
ఏదైనా ఇబ్బందులు ఎదురైతే రెసిడెంట్ కమిషనర్ పీఎస్, లైజన్ హెడ్ వందన బరువా (+91 9871999044), పీఆర్‌వో సీహెచ్. చక్రవర్తి (+91 9958322143), లైజన్ ఆఫీసర్లు జావేద్ హుస్సేన్ (+91 9910014749), రక్షిత్ నాయక్ (+91 9643723157)లను సంప్రదించాలని పేర్కొంది.
