అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ బంగారం రేట్లు రిటైల్ మార్కెట్లో తగ్గటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ల ర్యాలీ భారీగా ఉంటుందని అందరూ ఊహించినప్పటికీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లోని తాజా రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
మార్చి 3న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 2 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.49 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.17వేల 002గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 585గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే మార్చి 3, 2026న రేటు కేజీకి రూ.20వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 15వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.315 వద్ద ఉంది.
