ఐఎఎస్ పై దాడి: 20కి పైగా జిల్లాల్లో ప్రభుత్వ పనులకు బ్రేక్, అధికారుల డుమ్మ..

 ఐఎఎస్ పై దాడి: 20కి పైగా జిల్లాల్లో ప్రభుత్వ పనులకు బ్రేక్, అధికారుల డుమ్మ..

ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (OAS) సీనియర్ అధికారిపై జరిగిన దాడికి నిరసనగా ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పనులు స్తంభించిపోయాయి. దింతో దాదాపు 20కి పైగా జిల్లాల్లో అధికారులు ఒకేసారి సెలవుపై వెళ్లడంతో సాధారణ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై సోమవారం ఆయన ఆఫీసులో దాడి జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేయగా, వీరిలో బీజేపీ కార్పొరేటర్ జీవన్ రౌత్ కూడా ఉన్నారు.

ఈ దాడి రాష్ట్రవ్యాప్తంగా పౌర సేవల అధికారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మొదట OAS అసోసియేషన్ మంగళవారం నుండి సామూహిక సెలవులకు పిలుపునిచ్చింది. అయితే, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హామీ ఇచ్చిన తర్వాత ఈ పిలుపుని నిలిపివేశారు.

ALSO READ | బెంగళూరు కేఫ్‌లో ఘోరం: ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వలేదని సిబ్బందిపై దాడి..

అయితే  కటక్, గంజాం, గజపతి, కంధమాల్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, సంబల్‌పూర్, మయూర్‌భంజ్‌తో సహా 20కి పైగా జిల్లాల్లోని అధికారులు నిరసన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. దీంతో జిల్లా, స్థానిక స్థాయిలో కూడా ప్రభుత్వ పనులు దాదాపు నిలిచిపోయాయి.  

డిమాండ్లు, భద్రత పై ఆందోళనలు: 

ఈ దాడికి పై ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడు జగన్నాథ్ ప్రధాన్‌తో సహా దాడిలో పాల్గొన్న వారందరినీ తక్షణమే అరెస్టు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో ఉన్న అధికారుల భద్రతపై  కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో అధికారుల భద్రత పై  BMC కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. దాడి సమయంలో పని చేయని CCTV కెమెరాలను రిపేర్ చేయిస్తామని, అవసరమైతే ఆఫీసుల వద్ద సాయుధ గార్డులను కూడా మోహరించవచ్చని BMC మేయర్ తెలిపారు.  

ప్రభుత్వం విజ్ఞప్తి: ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి మాఝీ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పాలన, ప్రజా సేవలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు వెంటనే విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.