
మేకప్ అలవాటు లేనివాళ్లు అనుకోకుండా మేకప్ వేసుకోవాల్సి వస్తే... చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మేకప్ చేసుకోవాలని మనసులో ఉన్నప్పటికీ, నప్పుతుందో లేదో తెలియక చేసుకునేందుకు జంకడం సహజం. అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెప్తున్న టిప్స్ బిగినర్స్ కోసమే..!
మేకప్ వేసుకునే ముందు నాణ్యమైన క్లెనర్స్ లేదా టోనర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనినల్ల ముఖంపై జిడ్డు పోయి చర్మరంధ్రాలు శుభ్రం అవుతాయి. ఆ తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కాలమేదైనా సరే మేర ముందు మాయిశ్చరైజర్ తప్పడినరి. మేకప్ వేసుకోవడానికి కనీసం పావుగంట ముందు లైట్ గా మాయిశ్చరైజ్ రాయాలి. ఇలా చేయడం వల్ల మాయిశ్చరైజర్ ఫేస్ లో బాగా అబ్జార్బ్ అవుతుంది.
ఫౌండేషన్: మేకప్ లుక్ బాగుండాలంటే ఫౌండేషన్ ఎంపికపైనా కాస్త దృష్టి పెట్టాలి. సహజ చర్మతత్వం ఉన్నవాళ్లకి ఏ తరహా ఫౌండేషన్ అయినా బాగుంటుంది. అదే పొడి చర్మం ఉన్నవాళ్లకి కాస్త లిక్విడ్ టైప్ ఫౌండేషన్స్ కావాలి. ఆయిలీ స్కిన్ వాళ్లు నూనెలేని లిక్విడ్ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. మొటిమల సమస్యలున్న వాళ్లు నాన్కొమిడోజెనిక్ లేదా సాల్చిసిబిక్ యాసిడ్ ఉన్న ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ ని ఒకేసారి రాసుకోకుండా.. ముఖమంతా అక్కడక్కడా చిన్న చిన్న ముక్కల్లా స్పాంజ్‌తో పెట్టుకోవాలి. ముందుగా నుదురు, ముక్కుకి రెండువైపులా, గడ్డం కింద.. ఇలా ఒకదాని తరువాత ఒకటి స్పాంజ్‌తో రాయాలి మెడకింది రంగు ముఖంపై వచ్చే వరకు ఫౌండేషన్ ని స్పాంజ్ తో ముఖంపై అద్దాలి తర్వాత మేకప్ పౌడర్ రాయాలి.
పౌడర్: మేకప్ పౌడర్ కొద్దిగా తీసుకుని, దేవడ కింది భాగంలో రాసుకుని లైట్ల వెలుతురులో కాకుండా నేచురల్ లైట్ లో నిల్చోవాలి. అది ముఖం ఛాయలో కలిస్తేసరే.... లేదంటే నప్పలేదని అర్థం . పౌడర్ మరీ పల్చగా లేదా మందంగా వేసుకుంటే కళ్ల కింద ఆ తేడా క్లియర్‌గా కనిపిస్తుంది. అందుకే కళ్ల అడుగున మాత్రం కొద్దిగా కన్సీలర్ రాయాలి. ఎంత కాస్ట్ లీ పౌడర్ అయినా అందులో ఎంతోకొంత డస్ట్ ఉంటుంది. అది పట్టించుకోకుండా ముఖంపై డైరెక్ట్ గా రాయడం వల్ల ఆ డస్ట్ చర్మరంధ్రాల్లోకి వెళ్లగానే సమస్యలొస్తాయి. అలా కాకూడదంటే ముందుగా పౌడర్ అద్దిన బ్రష్ ని చేతిపై నాలుగైదు సార్లు బ్లెండ్ చేసి ఆతర్వాత ఆదే బ్రష్ తో ముఖంపై రాయాలి..
ఐ మేకప్ : వైట్ కలర్ ఐ- షేడ్ తీసుకుని సన్నటి లేయర్ గా ఐబ్రో షేన్ ఇవ్వాలి. తర్వాత బేస్ కలర్ ఐ షేడ్ ను రాయాలి. కళ్లు చిన్నగా ఉన్నా... పెద్దగా ఉన్నా అందాన్ని తెచ్చిపెట్టాలంటే కాటుక పెట్టుకోవాల్సింది. అందుకోసం నాణ్యమైన ఐ-లైనరిని ఎంచుకోవాలి. దీన్ని వాడేముందు కళ్ల చుట్టూ టిష్యూతో ఓసారి తుడవాలి. ఆపై ఐ-టైనర్ తో అవుట్ లైన్ గీయాలి. అలాగని మరీ దూరంగా కాకుండా వీలైనంత వరకూ కనురెప్పలకు దగ్గరగా గీయడం వల్ల
సహజంగా కనిపించొచ్చు. మీ వయసు, రంగుని బట్టి నలుపు, బ్రౌన్, గ్రే రంగుల్లో ఉండే-లైనర్ ను ఎంచుకోవచ్చు. కళ్లకు మస్కారా వేసుకునేటప్పుడు కనురెప్పల కొసల నుంచి గీయాలి. అది ఆరక ముందే ఐ-ల్యాష్ కర్తర్ ని వాడి ల్యాషె స్ ను వంపు తిప్పాలి. పూర్తిగా ఆరాక అలా చేస్తే కనురెప్పలకున్న వెంట్రుకలు రాలిపోతాయి. మేకప్ అంతా అయ్యాకే ఐషాడో వాడాలి. ఇలా చేయడం వల్ల కళ్లు తాజాగా కనిపిస్తాయి.
చీర్స్: బుగ్గలపై మేకప్ వేసుకునేటప్పుడు లైట్ స్మైల్ ఇవ్వాలి. అప్పుడు కళ్లకింద బాల్ లా వస్తుంది. దానిపై లైట్ పింక్ కలర్ లేదా స్మిన్ కలర్‌ని రాయాలి. మనం నవ్వినప్పుడు.. మాట్లాడినప్పుడు ఎట్రాక్టివ్ గా ఉండాలంటే- జా.లైన్ దగ్గర కూడా రాసుకోవచ్చు.
వెలుగు, లైఫ్