జ్యోతిష్యం : దాల్చిన చెక్కతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ.. మీ అదృష్టాన్నిమార్చే శక్తి కూడా ఇస్తుంది..

జ్యోతిష్యం : దాల్చిన చెక్కతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ.. మీ అదృష్టాన్నిమార్చే శక్తి కూడా ఇస్తుంది..

దాల్చిన చెక్కతో ఇంట్లోని నెగిటివ్​ ఎనర్జీని తొలగించవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  దీనిని సిద్దాంతం ప్రకారం ఉపయోగిస్తే ఇంట్లో ఆనందం... శాంతి... సంపద కలుగుతాయని  అంటున్నారు.  దీనిని ఎలా ఉపయోగిస్తే మంచి జరుగుతుంది.. ఇంట్లో చెడు ప్రభావం తొలగుతుంది.. పండితులు సూచిస్తున్న సలహాలు ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

దాల్చిన చెక్క జీవితంలో చాలా సానుకూల మార్పులను తీసుకొస్తుందని పండితులు అంటున్నారు. సహజంగా దీనిని ఆహార పదార్దాల్లో రుచిని.. సువాసనను పెంచేందుకు ఉపయోగిస్తాము.  కాని ఈ చెక్క పొడి వాస్తు ప్రకారం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు పండితులు.  

  • జ్యోతిష్య  సిద్దాంతం ప్రకారం... దాల్చిన చెక్క గాలికి ఇంట్లో నెగిటివ్​ ఎనర్జీని బయటకు పంపే శక్తి ఉంటుంది.  దీని పొడిని ప్రతి గుమ్మం దగ్గర చల్లితే ఆ ప్రాంతంలో ఉన్న చెడు ప్రభావాలు వెంటనే పోతాయి.  అలాంటి చెడు ప్రబావాల వలన కలిగే ఇబ్బందులకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.  ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ విషయంలో ఇబ్బందులు..దిష్టి సమస్య మొదలైనవాటినుంచి దాల్చిన చెక్కతో పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 
  • దాల్చిన చెక్క  మంచి ప్రకంపనలకు విస్తరించజేస్తుంది.  దీని వల్ల గాలి స్వచ్చగా ఉండి.. నెగిటివ్​ ఎనర్జీని ఆటోమేటిక్​ గా దూరం చేస్తుందని పండితులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే దీనిని  అనేక పూజల్లో ఉపయోగిస్తారు.  పూజలు.. వ్రతాల్లో దీనిని వాడితే.. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకం ఉండదని  వాస్తు సిద్దాంతం ద్వారా తెలుస్తోంది. 
  • మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... చిటికెడు దాల్చిన చెక్క పొడిని మెయిన్​ డోర్​ దగ్గర చల్లండి.  ఇలా ప్రతి శుక్రవారం చల్లండి.  దీని వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్​ ఎనర్జీ కూడా పాజిటివ్​ గా మారుతుంది.  ఇంట్లో గొడవలు జరుగుతుంటే ప్రతి సోమవారం దాల్చిన చెక్క పొడిని ఇంట్లో హాలు గుమ్మం దగ్గర చల్లండి.  ఇలా చేయడం వలన గొడవలకు కారణమయ్యే నెగిటివ్​ ఎనర్జీ పాజిటివ్​ గా మారుతుంది. . . 
  • ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య అనవసర గొడవలు జరుగుతుంటే... అలాంటి వాటి పరిష్కారానికిదాల్చిన చెక్క చాలా ఉపయోగపడుతుంది.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రోజున బెడ్​ రూంలో.. లేదా నిద్రించే స్థలంలో దాల్చిన చెక్కపై గులాబీ రేకులను కాల్చండి.   ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఏర్పడుతుంది. ఇలా 11 శుక్రవారాలు చేయాలి.  అయితే పొగను కాల్చేటప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఉండాలి.  ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాదు.. మాసం.. మద్యం... సిగరెట్​ మొదలగు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.  
  • ప్రతి శుక్రవారం పూజ చేసేటప్పుడు దాల్చిన చెక్కను పూజా సామాగ్రిని ఉంచే ప్లేట్​ లో ఉంచాలి.  ఇలా చేయడం వలన లక్ష్మీదేవి.. దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు బియ్యం, దాల్చినచెక్కను కలిపి ఉంచాలి. ఇది ఇంట్లో సౌభాగ్యాన్ని కాపాడుతుంది.
  • ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలు జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.  ఫైనాన్స్​ ప్రోబ్లమ్స్​ ఉన్నాయంటే వారు ఏ పని చేయలేరు.  అలాంటి వారు దాల్చిన చెక్కతో ఆర్థికంగా మెరుగుపడవచ్చని జ్యోతిష్య పండితులు అంటున్నారు. కొద్దిగా దాల్చిన చెక్కను పొడిచే అందులో కొద్దిగా పంచదార వేసి మిక్సీ పట్టాలి.  తరువాత దీనిని ఎర్రగుడ్డలో కట్టి పర్సులో కాని.. క్యాష్​ బాక్స్​లో కాని పెట్టుకోవాలి.  అలా చేయడంవలన ఆర్థికంగా బలపడతారని పండితులు చెబుతున్నారు. 
  • దాల్చిన చెక్కపొడిని .. కర్పురాన్ని మిక్స్​ చేయాలి. ఈ మిశ్రమంతో పాటు  అగర్​ బత్తీల పొగ చూపిస్తూ... ఇంట్లోని ప్రతిగదిలో తిప్పాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్దిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు అభిప్రాయపడుతున్నారు.   
  • వ్యాపారస్తులకు కూడా దాల్చిన చెక్క ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.  ఒక చిన్న బాక్స్​ లో దాల్చిన చెక్క పొడిలో లవంగాలను కలిపి  క్యాష్​ బాక్స్​ లో గాని.. టేబుల్​ పై కాని ఉంచాలి. ఇలా ప్రతిరోజు ఉదయం.. సాయంత్రం మార్చాలి.  మార్చేటప్పుడు దానిని నీళ్లలో కలిపి వేప చెట్టు మొదట్లో పోయాలి.  ఇలా చేయడం వలన షాపునకు ఆకర్షణ శక్తి పెరిగి.. కష్టమర్లను ఆకర్షిస్తారు.  దాదాపు ప్రతి మార్వాడీ షాపుల వారు ఈ పద్దతిని అవలంభిస్తారని.. అందుకే వారి షాపులు ఎప్పుడూ జనాలతో కళకళలాడుతుంటాయి.  
  • తాంత్రికంగా దాల్చిన చెక్క  ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగజేస్తుంది.  అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆవనూనె ... దాల్చిన చెక్క పొడిని మట్టి దీపంతో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వెలిగించాలి.  ఇలా చేయడం వలన చెడు దృష్టి, మంత్రవిద్యల నుంచి రక్షణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు.