
హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. సీజనల్ ఫీవర్తో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హాస్పిటల్కు వెళ్లారు. ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కేసీఆర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేనప్పటికీ మూడు రోజుల పాటు నందినగర్లోని నివాసంలోనే ఆయన ఉండనున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. వాతావరణం మారడం, వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం సాయంత్రం ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు.
నేరుగా బంజారాహిల్స్లోని నందినగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. వైద్యులు ఆయన ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని చూశారు. యశోదా హాస్పిటల్కు వైద్య పరీక్షలకు రావాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసం సోమాజీగూడ యశోదా ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ, సంతోష్ కుమార్, హరీష్ రావు కూడా ఆసుపత్రికి వెళ్లడం గమనార్హం.