- మనీలాండరింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నౌహీరా
- గుర్‌గావ్‌లో అరెస్ట్ చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో రూ.3 వేల కోట్ల మోసానికి పాల్పడిన నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి అరెస్ట్ చేసింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఈడీ విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న ఆమెను.. గుర్‌గావ్‌లో మంగళవారం అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌కు తరలించి గురువారం నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించింది.
హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో నౌహీరా షేక్ భారీ స్కామ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే ఏటా 36 శాతం లాభాలు ఇస్తామంటూ తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 1.72 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందుకు సంబంధించి హీరా గ్రూప్ సహా నౌహీరా షేక్, మొల్లి థామస్, బిజు థామస్‌లపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
