ఫోన్ల రికవరీపై  ఈడీ ఫోకస్..కీలకంగా అరోరా రిమాండ్‌‌ రిపోర్ట్‌‌

ఫోన్ల రికవరీపై  ఈడీ ఫోకస్..కీలకంగా అరోరా రిమాండ్‌‌ రిపోర్ట్‌‌
  •     లిక్కర్ స్కాంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు ఏడుగురు
  •     వీళ్లు 43ఫోన్లలో 8 సిమ్‌‌కార్డులు వాడినట్లు గుర్తింపు
  •     కీలకంగా అరోరా రిమాండ్‌‌ రిపోర్ట్‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరక్టరేట్‌‌‌‌(ఈడీ) దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ స్కామ్​లో 36 మంది నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్లు అమిత్‌‌‌‌ అరోరా రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో ఈడీ వెల్లడించింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ పాలసీ మార్పులో సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌(సౌత్ లిక్కర్​లాబీ) నుంచి రూ.100 కోట్లు చేతులు మారినట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా 170 ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. ఇందులో 17 ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు కోర్టుకు వివరించింది. మిగతా 153 ఫోన్లను ఏం చేశారనే వివరాలు రాబడతున్నది. ఇందులో భాగంగానే అమిత్‌‌‌‌ అరోరా రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొన్న వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ కేసులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్‌‌‌‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శరత్‌‌‌‌చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్‌‌‌‌ చేసింది.

లీగల్ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్తున్న ఈడీ

అమిత్‌‌‌‌ అరోరా వెల్లడించిన వివరాలతో రాష్ట్రానికి చెందిన ఏడుగురి వివరాలు తెలిశాయి. ఇందుకు సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటికే బోయినపల్లి అభిషేక్, శరత్​చంద్రారెడ్డిని అరెస్టు చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఇక మిగతా ఐదుగురికి కూడా వారం రోజుల వ్యవధిలో షెడ్యూల్‌‌‌‌ ప్రకారం నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. వీరిని ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇండో స్పిరిట్‌‌‌‌ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు, ఢిల్లీకి చెందిన విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రభుత్వ అధికారులకు లంచం అందినట్లు ఆధారాలు సేకరించింది. స్కామ్‌‌‌‌లో నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ లింకులు బయటకు లాగింది. లిక్కర్ పాలసీ రూపొందించిన సమయంలో ఢిల్లీ, హైదరాబాద్‌‌‌‌, ముంబై మీటింగ్స్ వివరాలను సేకరించింది.

ఫోన్లు, వాట్సాప్ డేటా సేకరణ

ఫోన్‌‌‌‌ నంబర్స్ సీడీఆర్‌‌‌‌‌‌‌‌, ఐఎంఈఐ నంబర్స్‌‌‌‌తో ప్రశ్నించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఏడుగురు నిరుడు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఆగస్టు 23వ తేదీ వరకు మొత్తం 43 ఫోన్లను, 8 సిమ్​లను మార్చినట్లు గుర్తించింది. ఈ ఫోన్లను ఏం చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. పాలసీ మార్పు కోసం డిస్కషన్ జరిగిన తేదీలు, మొబైల్‌‌‌‌ ఫోన్లను మార్చిన తేదీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. ఇందుకోసం ఐటీ రంగ నిపుణలతో డాటా కలెక్ట్ చేస్తున్నది. మొబైల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ సర్వర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డేటాను ఇప్పటికే రిట్రీవ్‌‌‌‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఫైనల్‌‌‌‌ పాలసీ ఫార్ములాను వాట్సాప్‌‌‌‌లో షేర్ చేసుకున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. లిక్కర్‌‌‌‌‌‌‌‌ స్కామ్ వెలుగులోకి వచ్చిన తరువాత ఆగస్ట్‌‌‌‌ 17న సీబీఐ కేసు రిజిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ధ్వంసం చేసిన ఫోన్లు ఎక్కడ

 సౌత్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ నుంచి రూ.100 కోట్లు సేకరించేందుకు జరిగిన మీటింగ్స్ లొకేషన్స్‌‌‌‌ను ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌లు సాక్షుల స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసినట్లు తెలిసింది. షెల్‌‌‌‌ కంపెనీల ద్వారా డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే బోయినపల్లి అభిషేక్, ఎమ్మెల్సీ కవిత, శరత్‌‌‌‌చంద్రారెడ్డి పేర్లను అమిత్‌‌‌‌ అరోరా ప్రస్తావించినట్లు ఈడీ రిమాండ్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లో వెల్లడించింది. ఆధారాలు లభించకుండా ఫోన్లను ధ్వంసం చేయడం లేదా మార్చారని వివరించింది. ఈ విచారణతో 153 ఫోన్లు ఏంచేశారు అనే వివరాలు రాబట్టనుంది. రికవరీ చేసిన ఫోన్స్ ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనుంది.