V6 News

డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా

డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నంద కుమార్‌‌‌‌పై ఈడీ విచారణ ముగిసింది. రెండో రోజైన మంగళవారం అధికారులు అతడి నుంచి డబ్ల్యూ 3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌‌ కీలక వివరాలను సేకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు, బంజారా హిల్స్‌‌ పీఎస్‌‌లో అతనిపై నమోదైన చీటింగ్‌‌ కేసుల్లో మనీలాండరింగ్‌‌ జరిగిందనే అనుమానాలతో 15న కేసు రిజిస్టర్​ చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది. 

కోర్టు అనుమతితో నంద కుమార్‌‌‌‌ను ఈడీ అధికారులు మంగళవారం ప్రశ్నిం చారు.‌‌ చంచల్‌‌గూడ జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విచారణ జరిపింది.