ఆసియా కప్ తప్పక జరుగుతుంది

ఆసియా కప్ తప్పక జరుగుతుంది

కరాచీ: కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సిన ఆసియా కప్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. షెడ్యూల్ ప్రకారం ఆ టోర్నీ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో వసీం ఖాన్ మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం శ్రీలంక లేదా యూఏఈలో ఆసియా కప్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఆసియా కప్‌ను రద్దు చేస్తారనే ఊహాగానాలను వసీం కొట్టిపారేశారు. ‘ఆసియా కప్ తప్పక జరుగుతుంది. సెప్టెంబర్ 2న ఇంగ్లండ్ నుంచి పాకిస్తాన్ టీమ్ స్వదేశానికి చేరుకుంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌‌లో ఆసియా కప్‌ను నిర్వహించుకునే వీలుంది. సమయాన్ని బట్టి మిగతా వివరాలు వెల్లడిస్తాం. శ్రీలంకలో కరోనా కేసులు ఎక్కువగా లేనందున ఆసియా కప్ తప్పక జరుగుతుందనే ఆశిస్తున్నాం. ఒకవేళ లంకలో కుదరకపోతే టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడానికి యూఏఈ రెడీగా ఉంది’ అని వసీం ఖాన్ పేర్కొన్నారు.