కోల్‌కతా: ఎలక్షన్ కమిషన్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్.. తుగ్లక్ కమిషన్ అని.. అది ఓ రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. మంగళవారం ఆమె బెంగాల్ సెక్రటేరియెట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ ఐటీ సెల్‌లోని ఒక మహిళా కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల మంది ఓటర్ల పేర్లను ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి తొలగించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఎలక్షన్ కమిషన్ ధిక్కరిస్తోంది. ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది" అని ఆమె అన్నారు. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరుతో.. సాధారణ ప్రజల ఓటు హక్కును లాగేస్తున్నారు. వారిని టెర్రరిస్టుల్లా చూస్తున్నారు. బీజేపీని సంతృప్తి పరచడానికి బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారు’’ అని మమత మండిపడ్డారు.
