ముఖ్య హెచ్చరిక: SIR ఫారం పేరుతో SCAM.. గుర్తుంచుకోండి.. ఒక్క OTPతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తరు !

ముఖ్య హెచ్చరిక: SIR ఫారం పేరుతో SCAM.. గుర్తుంచుకోండి.. ఒక్క OTPతో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తరు !

SIR ఫారం పేరుతో కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓటు హక్కు పదిలంగా ఉండేందుకు ‘సర్’​ ప్రక్రియలో అందిస్తున్న ‘ఎన్యుమరేషన్ ఫారం’ అత్యంత కీలకంగా మారింది. ఈ ఫారంలో ఏయే భాగంలో ఏ వివరాలు నమోదు చేయాలి ? ఒకవేళ జాబితాలో పేరు ఉంటే ఏం చేయాలి ? లేకపోతే ఏం చేయాలి? అని ఓటర్లు తలమునకలయ్యారు. ఎన్యుమరేషన్ ఫారంలోని పై భాగంలో ఓటరుకు సంబంధించిన ప్రాథమిక సమాచారమంతా ముందే ముద్రించి ఉంటుంది.

ప్రస్తుతం ఎలక్టోరల్ రోల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. ఓటరు పేరు, నియోజకవర్గం, సంబంధిత పోలింగ్ కేంద్రం వివరాలు ఫొటోతో సహా స్పష్టంగా ఉంటాయి. వీటితో పాటు ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే సంప్రదించడానికి వీలుగా సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్వో) పేరు, వారి ఫోన్ నంబరును కూడా అందులోనే ముద్రించారు. అయితే.. ఈ ఫారం నింపాక తెలియని నంబర్ నుంచి కేటుగాళ్లు కాల్ చేసి స్కామ్కు పాల్పడినట్లు తెలిసింది.

ఈ స్కామ్ ఏమిటి ?
1. సందర్భం: ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో SIR - Special Intensive Revision చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన అందరి పేర్లు ఉండేలా మరియు అక్రమ ఓటర్లను తొలగించే ఉద్దేశ్యం.

మోసగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు ?

  • SIR ఫారం నింపిన తర్వాత మీకు తెలియని నంబర్ నుండి కాల్ వస్తుంది.
  • కాల్ చేసే వ్యక్తి తను BLO-బూత్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పుకుంటాడు.
  • "2002 ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చిన OTP చెప్పండి" అని అడుగుతాడు.
  • ఒక్కసారి OTP చెప్పారంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోతుంది.

ముఖ్యమైన హెచ్చరికలు:

  • ECI/BLO ఎవరూ ఫోన్‌లో OTP అడగరు.
  • ఎవరికీ OTP ఇవ్వకండి.
  • OTP కోసం బెదిరిస్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.
  • భోపాల్‌లో ఇలాంటి స్కామ్ ఇప్పటికే రిపోర్ట్ అయింది. మోసగాళ్లు ప్రభుత్వ అధికారుల్లా నటించి "SIR.apk" లింక్ పంపి డేటా దొంగిలిస్తున్నారు.

ఏం చేయాలి ?

  • ఈ సమాచారాన్ని కుటుంబం, స్నేహితులు అందరికీ షేర్ చేయండి.
  • అధికారిక ECI ఛానెల్ ద్వారా మాత్రమే వెరిఫై చేసుకోండి. ఫోన్‌లో OTP/బ్యాంక్ వివరాలు ఇవ్వకండి.
  • బెదిరింపు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
  • గుర్తుంచుకోండి: 1 OTP = మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.
  • జాగ్రత్తగా ఉండండి.
 

►ALSO READ | ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై బుక్కైన కేసు!