V6 News

ఓపెనర్లు హాఫ్ సెంచరీలు : ఇంగ్లండ్ కు శుభారంభం

ఓపెనర్లు హాఫ్ సెంచరీలు : ఇంగ్లండ్ కు శుభారంభం

చెస్టర్ లీ సిటీ: వరల్డ్ కప్-2019 భాగంగా న్యూజిలాండ్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు జోరుగా బ్యాటింగ్ చేస్తున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న జేసన్ రాయ్, బెయిర్‌ స్టో పరుగుల వరద పారిస్తూ మెరుపు ఆరంభాన్నందించారు. ఆచితూచి ఆడుతూ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 111 రన్స్ చేసింది. ఈ జోడీని విడదీసేందుకు కివీస్ శ్రమిస్తోంది. బెయిర్‌స్టో(52), రాయ్(50) క్రీజులో ఉన్నారు.