ఈఎస్‌ఐ స్కాంలో షాకింగ్‌ నిజాలు.. పదికోట్లతో బంగారం కొన్న దేవికారాణి

ఈఎస్‌ఐ స్కాంలో షాకింగ్‌ నిజాలు.. పదికోట్లతో బంగారం కొన్న దేవికారాణి

తెలంగాణ ESI స్కాంలో కొత్త కోణాలు బ‌య‌టప‌డుతున్నాయి. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవీకారాణి అక్రమాస్తులపై ఏసీబీ అధికారులకు షాక‌య్యే నిజాలు తెలిశాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేవికారాణి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ గుర్తించింది. రూ. 10 కోట్ల విలువైన ఆభరణాలను దేవికారాణి కొనుగోలు చేసి, ఆ త‌ర్వాత వాటిని మాయం చేసిన‌ట్టు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం ఈ బంగారు ఆభరణాలు ఆచూకీ కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు

అక్ర‌మాస్తుల కేసులో అరెస్టైన ‌ దేవీకారాణి ఆస్తుల‌ను ఏసీబీ అధికారులు ఇప్ప‌టికే భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆమె పదవిని అడ్డం పెట్టుకొని భారీగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసింద‌ని , రూ.10 కోట్ల విలువైన ఆ ఆభరణాల ఆచూకీ గల్లంతయిన‌ట్టు తెలుస్తోంది. దేవికారాణి కుటుంబసభ్యులను ఈ బంగారు ఆభరణాల గురించి ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కమర్షియల్ ప్లాట్ నిర్మాణం కోసం దేవికారాణి ఓ బిల్డర్ కు రూ. 3.47 కోట్లను ఇచ్చింది. ఈ నెల 1వ తేదీన బిల్డర్ నుండి రూ.4 కోట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు బిల్డర్ ను కూడ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడ దేవికారాణి పెట్టుబడులు పెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు