భవిష్యత్‌‌‌‌ ఇంధనం ఇథనాలే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

భవిష్యత్‌‌‌‌ ఇంధనం ఇథనాలే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ట్రాన్స్‌‌పోర్టేషన్ సెక్టార్‌‌‌‌లో కార్బన్ ఎమిషన్స్ వెంటనే తగ్గించాలని పిలుపిచ్చిన గడ్కరీ

న్యూఢిల్లీ: ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కార్బన్ ఎమిషన్స్‌‌‌‌ను వేగంగా తగ్గించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. బయో ఫ్యూయల్స్‌‌‌‌ను  వాడడంలో ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలవగలిగే సామర్ధ్యం మనకు ఉందని అన్నారు. షుగర్‌‌‌‌‌‌‌‌, ఇథనాల్ కాన్ఫెరెన్స్‌‌‌‌లో వర్చువల్‌‌‌‌గా పాల్గొన్న ఆయన, ఇథనాల్‌‌‌‌ వాడకం పెరగాలని అన్నారు. పెట్రోల్‌‌‌‌, డీజిల్ అవసరాల్లో 80 శాతాన్ని దిగుమతుల ద్వారా చేరుకుంటున్నామని, ఇందుకోసం ఏడాదికి రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇది ఆర్థిక, పర్యావరణ సమస్య. కార్బన్ ఎమిషన్స్‌‌‌‌లో 90 శాతం వాటా ట్రాన్స్‌‌‌‌పోర్టేషన్‌ సెక్టార్‌‌‌‌ నుంచే ఉంది. కార్బన్‌‌‌‌ ఎమిషన్స్‌‌‌‌ను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది.

పెట్రోలియం దిగుమతులను తగ్గించేందుకు బయో ఫ్యూయల్స్‌‌‌‌, బయో గ్యాస్‌‌‌‌ను ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది’ అని గడ్కరీ అన్నారు. బయో ఫ్యూయల్స్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ను పెంచే ఫ్రేమ్‌‌‌‌వర్క్స్‌‌‌‌ను  ప్రోత్సహిస్తున్నామని, ఇంధనంగా ఇథనాల్‌‌‌‌ వాడకాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. పాడైన ధాన్యాలు, మొక్కజొన్న, చెరుకు వంటి వాటి నుంచి ఇథనాల్‌‌‌‌ను తయారు చేయొచ్చు కాబట్టి  దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కోరారు. ‘మన దగ్గర మిగులుగా ఉన్న చెరుకు, రైస్‌‌‌‌, మొక్క జొన్నను సక్రమంగా వాడుకోవడంతో పాటు, ఎదురు, వ్యవసాయ వ్యర్థాలు, పత్తి వంటి వాటి నుంచి కూడా ఇథనాల్‌‌‌‌ను ఉత్పత్తి చేయొచ్చు’ అని గడ్కరీ వివరించారు. బయో ఫ్యూయల్స్ కోసం నాలుగు కమర్షియల్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఏకైక దేశం ఇండియానేనని అన్నారు. ప్రతీ ప్లాంట్‌‌‌‌ రెండు లక్షల మంది రైతులకు సాయపడుతోందని, మూడు లక్షల టన్నుల కార్బన్ ఎమిషన్స్‌‌‌‌ను తగ్గిస్తుందని అంచనావేశారు. వ్యవసాయ రంగాన్ని ఎనర్జీ, పవర్‌‌‌‌‌‌‌‌ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా కూడా వాడుకోవాలని కోరారు.