ముంబై ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల గంజాయి పట్టివేత.. మాజీ మిస్ కేరళ కంటెస్టెంట్ హర్ష సన్నీ అరెస్ట్

ముంబై ఎయిర్ పోర్టులో రూ.12కోట్ల గంజాయి పట్టివేత.. మాజీ మిస్ కేరళ కంటెస్టెంట్ హర్ష సన్నీ అరెస్ట్

అక్రమ గంజాయి రవాణా కేసులో మోడల్, మాజీ మిస్ కేరళ కంటెస్టెంట్ హర్ష సన్నీని ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె లగేజీ నుంచి దాదపు 12 కోట్లు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ముంబై వచ్చిన హర్ష సన్నీ లగేజీ తనిఖీ చేసిన ఎయిర్ పోర్టు అధికారులు గంజాయితో పట్టుబడినట్లు వెల్లడించారు. 28 ఏళ్ల హర్ష సన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్మగ్లింగ్ వెనక ఉన్న నెట్ వర్క్ వెన్న  సంబంధాలపై విచారణ చేస్తున్నారు. 

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 10 అర్థరాత్రి ఎయిర్ ఇండియా ఇండిగో విమానం   TG 351లో బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు హర్ష సన్నీ  చేరుకుంది.  రెగ్యులర్ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులఆమెపై అనుమానం వచ్చి ఆమె లగేజ్ చెక్ చేయగా గంజాయి బయటపడింది. 

►ALSO READ | ఒమన్ తీరంలో నౌకలపై దాడి ఘటన.. అమెరికా రాయబారికి భారత్ సమన్లు

హర్ష సన్నీ ట్రాలీ బ్యాగ్ లో దాచిన 12 వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లు లభించాయి. NDPS ఫీల్డ్ టెస్టింగ్ కిట్‌ను ఉపయోగించి పరీక్షించి గంజాయి అని గుర్తించారు. నిషేధిత డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినందుకు హర్ష సన్నీని ఎన్‌డిపిఎస్ చట్టం కింద కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం హర్ష సన్నీని ఫోర్ట్ కోర్టులో హాజరుపరచగా ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.