హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీల్లో శుక్రవారం జరగాల్సిన డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ పుల్లయ్య వెల్లడించారు. గ్రూప్ 4 పరీక్షల నేపథ్యంలో ఈ ఎగ్జామ్ ను పోస్ట్‌పోన్ చేసినట్లు తెలిపారు.
వాయిదా పడిన పరీక్షను జులై 15న నిర్వహిస్తామని చెప్పారు. మిగిలిన రోజుల్లో జరిగే పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని గురువారం పేర్కొన్నారు.
