గర్భిణులకు బిగ్ అలర్ట్: కలుషిత గాలి పీలిస్తే మీతో పాటు పుట్టబోయే బిడ్డకు ప్రమాదమే..!

గర్భిణులకు బిగ్ అలర్ట్: కలుషిత గాలి పీలిస్తే మీతో పాటు పుట్టబోయే బిడ్డకు ప్రమాదమే..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీతో సహా వివిధ మెట్రో సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా పెరుగుతోందని, ఫలితంగా ఆయా నగరాల్లోని గర్భిణులు, వారికి పుట్టబోయే బిడ్డలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘‘ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా ఉన్నా.. తప్పనిసరై పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. పెద్దలు మార్నింగ్ వాక్‎కు, ఆ తర్వాత పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు. కానీ మాస్కులను మాత్రం ఎవరూ పెట్టుకోవడంలేదు. కాలుష్యపూరితమైన గాలిలోని అల్ట్రాఫైన్ పార్టికల్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తే.. తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. 

గర్భంతో ఉన్న మహిళలతోపాటు వారికి పుట్టబోయే బిడ్డలకూ రిస్క్ పెరుగుతుంది. నెలలు నిండక ముందే కాన్పు, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, జీవితాంతం మెదడు, ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యల బారిన పడటం వంటివి సంభవిస్తాయి. చివరకు తల్లి గర్భంలోని పిండానికి కూడా ఈ విషపూరిత గాలితో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఈ సమస్యను అత్యవసరమైనదిగా భావించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది” అని క్లౌడ్ నైన్ హాస్పిటల్స్‎కు చెందిన సీనియర్ కన్సల్టెంట్, నియోనేటాలజిస్ట్ డాక్టర్ శిశిర్ భట్నాగర్ వెల్లడించారు.