డీ మార్ట్ లో సేల్ కి పెట్టిన ఎక్స్ పైర్డ్ బ్రెడ్

డీ మార్ట్ లో సేల్ కి పెట్టిన ఎక్స్ పైర్డ్ బ్రెడ్

డీ మార్ట్...  వేల కొద్దీ వస్తువులు, చెప్పలేనన్ని ఆఫర్లు. సరుకులు నిండుకున్నాయంటే చాలు తమ బడ్జెట్ లో అన్ని వస్తువులూ ఒకే వద్ద దొరుకుతాయన్న కారణంతో చాలా మంది ఈ రోజుల్లో సూపర్ మార్కె్ట్ల బాట పడడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా దేశంలోనే ప్రసిద్ది చెందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన డీ మార్ట్ గురించి ఇక చెప్పక్కర్లేదు. ఎప్పుడూ కస్టమర్లను ఆఫర్స్ ఆకట్టుకుంటూనే ఉంటాయి. అంత డిమాండ్ ఉన్న స్టోర్ లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఓ కస్టమర్ బ్రెడ్ ప్యాకెట్ ను కొనుగోలు చేయగా.. అనంతరం అది ఎక్స్ పైరీ డేట్ అయిపోయిందని తెలిసి షాకయ్యాడు. 

మలక్ పేట డీ మార్ట్ స్టోర్ లో జరిగిన ఈ ఘటనలో మామూలుగా ఆ బ్రెడ్ ప్యాకెట్ పై కంపెనీ ప్రింట్ చేసిన చివరి తేదీ ఉంది. కానీ ఆ డేట్ అయిపోవడంతో...  మళ్లీ అదే కంపెనీ పేరుతో ఆ ప్యాకెట్ పై పాత తేదీ స్థానంలో మరో కొత్త డేట్ ను ప్రింట్ చేసి ఉన్న స్టిక్కర్ ను అంటించి వినియోగదారులను మోసం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఓ కస్టమర్ మాత్రం దాన్ని కని పెట్టేశాడు. ఈ విషయంపై యాజమాన్యాన్ని నిలదీయగా దానితో వారికి ఎలాంటి సంబంధం లేదని సమాధానమిచ్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న మిగతా బ్రెడ్ ప్యాకెట్లనూ ఆ వ్యక్తి తీసివేయించారు. ఇలా కాలం చెల్లిన వస్తువులను ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనే ఆఫర్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆ కస్టమర్ ఆరోపించారు. ఇలా ఇక్కడ ఇంకెన్ని వస్తువులున్నాయో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.