ఐల్యాండ్స్ లో ఎంజాయ్ చేయాలనుకునే టూరిస్టులు ఎక్కువగా మాల్దీవ్స్ వెళ్తారు. లేదంటే మరో దేశం వెళ్తారు. అయితే మన దేశంలో కూడా అందమైన ఐల్యాండ్స్ (దీవులు) ఉన్నాయి. కాకపోతే, చాలామందికి తెలియదు. పాస్ పోర్ట్ అవసరం కూడా లేకుండా వెళ్లి ఎంజాయ్ చేయగలిగే ఐల్యాండ్స్ గురించి...
దీవార్
గోవాకు దగ్గర్లోని ముండో నదిలో ఉంది ఈ దీవార్. హిస్టరికల్, కల్చరల్ ప్లేసెస్ ను ఎక్స్ప్లోర్ చేసే వాళ్లకు ఈ దీవి మంచి ఛాయిస్. ఇక్కడ గొప్ప చరిత్ర ఉన్న నాలుగు ఊళ్లున్నాయి. 400 ఏళ్ల క్రితం వాటి పోర్చుగీస్ నిర్మాణాలు ఇక్కడ చూడొద్దు. హిందూ దేవాలయాలతోపాటు, చర్చిలు కూడా కనిపిస్తాయి. పనాజికి దగ్గర్లో ఉన్న ఈ దీవికి బోట్లో చేరుకోవచ్చు. తిరుగుతూ ఈ దీవి ఎక్స్ ప్లోర్ చేయొచు. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అవసరమీ నుకుంటే ఇక్కడే రాత్రి కూడా గడపొచ్చు. ప్రశాంతంగా గడుపునూ వేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు. అక్కడ్నుంచి కార్లలోనో, బస్సుల్లోనో తిరుగుతూ దీనిని ఎక్స్ ప్లోర్ చేయొచ్చు. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అవసరమనుకుంటే ఇక్కడే రాత్రి కూడా గడపొచ్చు. ప్రశాంతంగా గడుపుతూ, నేచర్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి వెళ్లొచ్చు.
ఉమానంద
ప్రపంచంలోనే అతి చిన్నన ద్వీపం ఇది. అసోంలోని గౌహతికి దగ్గర్లో ఉన్న బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది. ఈ దీవిలో ఉమానంద (శివుడి) గుడి ఉండటం వల్ల దీన్ని ఉమానంద దీవి అంటారు. గౌహతి నుంచి పడవల్లో ఈ దీవికి చేరుకోవచ్చు. దీవిలో ఎక్కువ భాగం అడవితోనే ఉంటుంది. చుట్టూ పచ్చనిచెట్లు, రైనో, ఒరంగుటాన్ వంటి అడవి జంతువులతో ఆకట్టుకుంటుంది. దీవిలోకి ఎంట్రీ ఫ్రీ. ట్రావెల్ ఖర్చులు పెట్టుకుంటే చాలు. టెంపులకు వెళ్లొచ్చు. రోజంతా ప్రశాంతంగా గడపొచ్చు. అక్కడి నేచర్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు.
క్విబుల్
ఇది కూడా నదీ ద్వీపమే. తమిళనాడులోని అదయార్ నదీ జలాల్లో ఉంది. అయితే ఇందులో సముద్రపు నీళ్లు కూడా కలుస్తాయి. చెన్నైకు దగ్గర్లోనే ఉంటుంది. బ్రిటిష్ కాలం నుంచి ఇది జనాలను ఆకర్షిస్తోంది. ఆ కాలంలో కట్టిన సెమెట్రీ ఇప్పటికీ ఉంది. బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాలు చూసేందుకు, హిస్టారికల్ ప్లేసెస్ను ఎక్సప్లోర్ చేయాలనుకునేవాళ్లకు ఈ దీవి బెస్ట్. చుట్టూ ఉన్న చెట్టూ చేమ కూడా ఆకట్టుకుంటాయి. చెన్నై నుంచి అరగంటలో ఈ దీవికి చేరుకోవచ్చు. వీకెండ్స్ మంచి టూరిస్ట్ ప్లేస్లో ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు ఈ దీవికి వెళ్లొచ్చు.
ALSO READ : యువత జర భద్రం: 20 ఏళ్లకే షుగర్..
కవ్వాయి
కేరళలోని అందమైన దీవుల్లో కవ్వాయి ఒకటి. వెనిస్కు చెందిన యాత్రికుడు మార్కోపోలో కూడా తన పుస్తకంలో ప్రస్తావించిన దీవి ఇది. కన్నూర్ జిల్లాలోని పయ్యమార్ దగ్గర్లోని బ్యాక్ వాటర్ ఐల్యాండ్ కవ్వాయి. కంకోల్, వన్నాతిచల్, కుప్పితోడు, కునివన్, కవ్వాయి వంటి నదుల నుంచి వచ్చే నీళ్లతో ఈ దీవి ఏర్పడింది. పడవల్లో ప్రయాణం చేస్తూ ఈ దీవిని చేరుకోవచ్చు. దీవి చుట్టూ కొబ్బరి చెట్లు ప్రత్యేక ఆకర్షణ. బోట్లలో తిరుగుతూ దీవిని చుట్టిరావొచ్చు. అక్కడి ప్రజలు లైఫ్ స్టైల్ను దగ్గర నుంచి చూడొచ్చు. జార్బింగ్, బోటింగ్ ఇక్కడి ప్రత్యేకతలు. ఇక్కడ జరిగే కయాకింగ్ (కయాక్ అనే పడవల్లో ప్రయాణించడం) టూరిస్ట్లకు మంచి అనుభూతిని అందిస్తుంది.
మజులి
ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం 'మజులి'. అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉంది. దేశంలో జిల్లాగా మారిన తొలి దీవి ఇదే. 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. ఈ దీవికి పడవల్లో మాత్రమే వెళ్లగలం. ఈ దీవుల్లో ఎంతోమంది ప్రజలు బతుకుతున్నారు. పడవల్లోనే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పడవలు తిరుగుతాయి. చిన్న గుడిసెల్లో ఉంటూ, పడవల్లో వెళ్లే అక్కడి ప్రజల జీవనవిధానం ఆకట్టుకుంటుంది. కొత్త కల్చర్ లా అనిపిస్తుంది. ఎక్కువగా ప్రకృతిపైనే ఆధారపడి బతుకుంటారు ఇక్కడివాళ్లు. కనుచూపు మేరలో నీళ్లు, పచ్చిక మైదానాలు, పచ్చదనాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు మీజులి ఐలాండ్ మంచి అనుభూతిని అందిస్తుంది. అసోంలోని జోరత్ పట్టణానికి 20 మీలో ఉంటుంది.
సెయింట్ మేరీస్
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మరో ఆకర్షణీయ దీవి 'సెయింట్ మేరీస్ , ఇది నాలుగు చిన్న దీవుల సమూహం. మంగళూరుకు దగ్గర్లో, అరేబియన్ తీరంలో ఉంటుంది. దీన్ని 'కోకోనట్ ఐల్యాండ్' అని కూడా అంటారు. మాల్ఫీ బీచ్ నుంచి మూడు కిలోమీటర్లు బోట్ ద్వారా ప్రయాణం చేసి ఈ దీవికి చేరుకోవచ్చు. ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి కూడా ఇక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. అందమైన బీచ్లు, కొబ్బరి చెట్లు రిసార్ట్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ దీవి ప్రత్యేకతలు. తీరంలో కనిపించే రాతి పర్వతాల మరో ప్రత్యేకత. ఈ రాళ్లలో కొన్ని పిల్లర్ షేప్లో ఉంటాయి. ఈ రాళ్లు ఆఫ్రికాలోని మడగాస్కర్లో ఉన్న రాళ్లను పోలి ఉండటం విశేషం. నేచర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేయగలిగే దీవి ఇది.
