జపాన్‌లోని స్టూడియోలో భారీ పేలుడు

జపాన్‌లోని స్టూడియోలో భారీ పేలుడు

జపాన్‌లోని క్యోటో నగరంలో యానిమేషన్‌ స్టూడియోలో భారీ పేలుడు  జరిగింది. ఈ ప్రమాదంలో ఒక‌రు చ‌నిపోగా, 37 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది  వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 35 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్టూడియోలోని మొదటి అంతస్తులో ఒక వ్యక్తి పేలుడుకు పాల్పడినట్లు స్ధానికులు చెబుతున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.  గాయపడిన వారిని  స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.