V6 News

రైతు బీమా స్కీం దరఖాస్తు గడువు పెంపు

రైతు బీమా స్కీం దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతు బీమా స్కీం దరఖాస్తు గడువును రాష్ట్ర సర్కా రు పెంచింది. ఈ నెల 13వరకు అప్లికేషన్స్ గడు వును పెంచుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంగళవారం వెల్లడించింది. రైతు బీమాకు అర్హులైన కొత్త రైతుల దరఖాస్తులకు, రెన్యూవల్స్ కు  ఆగస్టు 1 వరకే చివరి తేదీ కాగా.. తాజాగా గడువును పొడిగించారు.  జూలై 15న గైడ్‌‌ లైన్స్‌‌ జారీ చేసినా.. సైట్‌‌ ఓపెన్‌‌ కావడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యూవల్స్ 38.98లక్షల ఎల్‌‌ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌‌తో పాటు.. కొత్తగా అప్‌‌లోడ్‌‌ చేయాల్సిన 11.83లక్షల రైతుల వివరాలు గడువులోగా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది.

గత నెలలో భారీ వర్షాలతో అర్హుల రైతుబీమా నమోదు ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో ఈనెల 1న "వీ6 వెలుగు" పేపర్‌‌లో  "రైతు బీమా ఆగమాగం" అనే శీర్షికన కథనాన్ని ప్రచురించగా... రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గడువును ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు పెంచుతున్నట్లు అగ్రికల్చర్‌‌ కమిషనర్‌‌ తెలిపారు. రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రైతు బీమా కింద రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.