హైదరాబాద్: నటి, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ వ్యక్తిని చీట్ చేసి రూ.9.5 కోట్లు కాజేసిందన్న ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది.
లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన కుమారుడు వై.వి.ధర్మేంద్రను ప్రేమ, పెళ్లి పేరుతో నటి అషు రెడ్డి మోసం చేసిందని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2018లో ఇండియాకు వచ్చిన సమయంలో తన కుమారుడికి అషురెడ్డితో పరిచయం ఏర్పడిందని.. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుందామని నమ్మించి ఆర్థిక అవసరాలు తీర్చుకుందని ఆరోపించారు.
బంగారం, ఖరీదైన ఫ్లాట్లు, లగ్జీరీ కార్లు కొనుగోలు చేసిందన్నారు. తన కొడుకు దగ్గరి నుంచి పలు దఫాల్లో సుమారు రూ.9.5 కోట్ల రూపాయలు ఆషు రెడ్డి కాజేసిందని ఆరోపించారు. అషు రెడ్డి ఫ్యామిలీ కూడా మొదట్లో పెళ్లికి ఒప్పుకుని ఆ తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నటి అషు రెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు చేసు నమోదు చేశారు. చీటింగ్ ఆరోపణలపై అషు రెడ్డి మీద కేసు నమోదు కావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ సమంతగా అషు రెడ్డి పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫొటోలు షేర్ చేయడంతో పాటు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌లో కూడా పొల్గొని ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. పలు సినిమాల్లో కూడా అషు రెడ్డి సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించింది.

