అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: సినీనటి అంజలి

అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట: సినీనటి అంజలి

సిటీ నెట్​వర్క్, వెలుగు: సైబర్​నేరాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం నాలుగు పోలీస్​కమిషనరేట్ల పరిధిలో సురక్షా కా త్రివర్ణ.. సైబర్​స్వతంత్ర తెలంగాణ దిశగా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలోని గచ్చిబౌలి ఇంజినీరింగ్​ స్టాఫ్​ కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటి అంజలితో పాటు సీపీ రమేశ్, సైబరాబాద్​ట్రాఫిక్​జాయింట్​సీపీ సన్​ప్రీత్​సింగ్​పాల్గొన్నారు.  

వికారాబాద్​జిల్లా తాండూరులో చౌరస్తా నుంచి సెయింట్ మార్క్ స్కూల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తర్వాత నిర్వహించిన సమావేశానికి ఎస్పీ స్నేహా మెహ్రా హాజరయ్యారు. డీఎస్పీ నర్సింగ్​యాదయ్య, సీఐ పరమేశ్వర్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.