బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారంవల్లే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణలో కవిత స్థాపించిన కొత్త పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. బీఆర్ ఎస్ ఓట్లనే చీలుస్తుంది.. బీఆర్ ఎస్ పార్టీకీ, కేటీఆర్ కు నష్టం.. మాకు ఎలాంటి నష్టం లేదని వంశీకృష్ణ అన్నారు. ఇప్పటికే ఉన్న బీఆర ఎస్ ను బీఆర్ ఎస్ అనాలో.. టీఆర్ ఎస్ అనాలో ప్రజలు సందిగ్ధం ఉన్నారు. ఇక కొత్త టీఆర్ఎస్ పార్టీతో ఒకిగేదేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా ఒకటే.. మెదడు లేని తెలివి లేదన్న ఒకటే అనే చందంగా ఉంది ఆ పార్టీల పరిస్థితి అన్నారు వంశీకృష్ణ.
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం తరపునమంత్రులు పొన్నం, వివేక్ వెంటకస్వామిలు చర్చించి వారిని ఒప్పించి సమ్మె విరమింపజేశారన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం..కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బీఆర్ ఎస్ పార్టీ పట్టించుకోలేదన్నారు వంశీకృష్ణ.

