ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా ఉప్పల్ రింగు రోడ్డు దగ్గర ఉన్న కొన్ని బస్ స్టాపులను తాత్కాలికంగా మార్చినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా వరంగల్ రూట్ లో వెళ్లే బస్సులకు సంబంధించి బస్ స్టాప్ ను మార్చుతున్నట్లు ప్రకటించారు. వరంగల్, హనుమకొండ, యాదగిరిగుట్ట బస్సుల స్టాప్ ప్రస్తుతం ఉన్న దగ్గర నుంచి మార్చినట్లు తెలిపారు.
ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న పాత స్టాప్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చినట్లు తెలిపారు. వరంగల్ రూట్లో బస్సుల కోసం ప్రయాణికులు కొత్త స్టాప్ కే వెళ్లాలని చెప్పారు. ఏప్రిల్ 26 ఉదయం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ లో వరంగల్ వైపు రహదారి మూసివేయనున్నారు.
ఈ సందర్భంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

