V6 News

ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి విన్నారా.. పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎంత మోసం జరిగిందో చూడండి

 ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి విన్నారా.. పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో ఎంత మోసం జరిగిందో చూడండి

హైదరాబాద్ లో భారీ మల్టీ మార్కెటింగ్ మోసాన్ని ఛేదించారు  చేదించారు మీర్ చౌక్ పోలీసులు. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు ఆశ చూపి అమాయకులను వలలో వేసుకుంటున్న నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం ( 2026 ఏప్రిల్ 26) సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో,  ఐపీఎస్ అధికారి కిరణ్ ఖరే ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో కీలక నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

నిందితులు మల్టీలెవెల్ డిజిటిల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులను మోసం చేసినట్లు గుర్తించారు.  ట్రైనింగ్స్, ఆన్‌లైన్ క్లాసులు పేరుతో ఒక్కొక్కరి దగ్గర రూ.199 నుంచి రూ.249 వరకు వసూలు చేశారు.  దేశవ్యాప్తంగా మీటింగ్స్, ఈవెంట్స్ నిర్వహించి సభ్యులను ఆకర్శించిన నిందిచారు.  IST, MT, FT ట్రాక్ పేర్లతో ప్యాకేజీలు చూపించి డబ్బు వసూలు చేశారు. నిందితుల ఖాతాల్లో సుమారు రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మిర్చౌక్ పోలీసులు హర్యానా గురుగ్రామ్‌లోని సెక్టార్-54కు చెందిన హరీష్ కుమార్ సింగ్లా (61)ను అరెస్ట్ చేశారు.  ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌లో కంట్రీ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. క్రైమ్ నంబర్ 62/2026 కింద BNS చట్టంలోని 61, 316(2), 318(4), 308, 351, 352 సెక్షన్లు, తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం-1999లోని సెక్షన్ 5, అలాగే ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) చట్టం-1978లోని సెక్షన్లు 3, 4, 5, 6 మరియు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66D కింద కేసు నమోదు చేశారు.

ఈజీ మనీ కోసం ఈ ముఠా 18 నుంచి 24 ఏళ్ల యువత, గృహిణులను టార్గెట్ చేసింది. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో అమాయకులను మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే రైన్ బజార్, మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లలో 3 కేసులు నమోదయినట్లు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితులు మొహమ్మద్ అక్రం, మొహమ్మద్ నౌమాన్ రజా, మొహమ్మద్ ఆస్లాం లను అరెస్ట్ చేశారు.  నిందితులు  ఆచీవర్స్ క్లబ్ కార్యాలయంలో ఏజెంట్లుగా పనిచేసినట్లు గుర్తించారు.

నిందితుల నుంచి 2 ఐఫోన్లు, 1 వన్‌ప్లస్ మొబైల్, 1 ఐప్యాడ్, మెర్సిడెస్ బెంజ్ కారు (TS15FA0555) సీజ్ చేశారు. ఫోన్ నంబర్లు, లీడ్స్ ఉన్న నోట్‌బుక్స్, ఆన్‌లైన్ ట్రైనింగ్ వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. 

ప్రజలు మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసుల ఈ సందర్భంగా సూచించారు. ఈజీ మనీ పేరుతో వచ్చే స్కీమ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.