హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అలర్ట్ : భారీ వర్షాలు పడనున్నాయి.. ఒకేసారి బయటకు రావొద్దు

హైదరాబాద్ ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అలర్ట్ : భారీ వర్షాలు పడనున్నాయి.. ఒకేసారి బయటకు రావొద్దు

హైదరాబాదీలకు ట్రాఫిక్ పోలీసులు కీలకమైన అప్ డేట్ ఇచ్చారు. వీక్ డేస్ కావటంతో సహజంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో.. ఉద్యోగులకు కీలకమైన అలర్ట్ ఇచ్చింది సైబరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. 

హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు.. ఒకేసారి బయటకు రావొద్దని.. ఒకేసారి లాగ్ అవుట్ అవ్వొద్దని సూచించింది. ఎర్లీ లాగ్ అవుట్.. విడతల వారీగా.. సమయం తీసుకుని ఒక్కొక్కరుగా బయటకు రావాలని ఐటీ కంపెనీలకు సూచించింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. ఉద్యోగులు అందరూ ఒకేసారి బయటకు రాకుండా.. కొంత కొంత సమయం తీసుకుని.. విడతల వారీగా పంపించే విధంగా ఎర్లీ లాగ్ అవుట్ విధానాన్ని అమలు చేయాలని ఐటీ కంపెనీలకు సూచించింది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్. 

భారీ వర్షాల హెచ్చరికలతో.. ట్రాఫిక్ రద్దీ పెరిగి.. అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. వాటర్ లాగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్పష్టం చేసింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. ఈ పరిణామాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఉద్యోగులను ముందస్తుగా ఇళ్లకు వెళ్లే విధంగా టైం షెడ్యూల్ మార్చాలని సూచిస్తూ.. ఐటీ కంపెనీలకు లేఖ రాసింది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్. 

గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, నానక్ రాంగూడ ఏరియాల్లోని ఐటీ కంపెనీలు అన్నీ.. ఈ సూచనలు, సలహాలు పాటించాలని కోరింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్. భారీ వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ సిటీలోని సైబరాబాద్ ఏరియాలో ట్రాఫిక్ జాం అవుతుంది.. ఆ రద్దీలో గంటలకొద్దీ రోడ్లపై వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేసింది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్.