పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్యాసంస్కరణల కంటే ముందు మీడియాల సంస్కరణలు జరగాలని అన్నారు. ప్రజలకు వాస్తవాలను అందించడంలో మీడియా బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందన్నారు గీతాంజలి. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో సంస్కరణలపై చర్చజరుగుతున్న క్రమంలో గీతాంజలి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె అభిప్రాయాలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
తన సోషల్ మీడియా బ్లాగ్ Xలో స్పందించిన ఆమె.. విద్యాసంస్కరణలకంటే ముందు మీడియా సంస్కరణలు అవసరం.. మీడియా బాధ్యతాయుతంగా, నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలకు సరైన సమాచారం పొందగలరు.. అప్పుడు విద్యావ్యవస్థలోనూ అర్థవంతమైన మార్పులు తీసుకురావడం సులభమవుతుందని అన్నారామె.
Everyone is demanding educational reforms.
— Gitanjali J Angmo (@GitanjaliAngmo) July 26, 2026
Excellent idea.
But can we begin by reforming the media first?
Today, our biggest influencers are not our teachers but TV studios, WhatsApp forwards, YouTube channels and social media trollers. Some of them teach us to hate before we…
ఇటీవల దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణ, సంస్కరణలపై చర్చలు జరుగుతున్న క్రమంలో గీతాంజలి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆమె అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
