కెనడాలో జాబ్ .. ప్రతినెలా రూ.70 వేలు పంపిస్తున్నా ఇంట్లో ఖర్చులకి సరిపొవట్లేదట..: ఓ కెనడా యువకుడి ఆవేదన !

కెనడాలో జాబ్ .. ప్రతినెలా రూ.70 వేలు పంపిస్తున్నా ఇంట్లో ఖర్చులకి సరిపొవట్లేదట..: ఓ కెనడా యువకుడి ఆవేదన !

విదేశాలకు వెళ్లి సంపాదించడం.. ఇండియాలో ఉన్న కుటుంబానికి అండగా ఉండటం చాలా మంది యువకులు చేస్తున్నదే. కానీ,  కష్టపడి సంపాదించి పంపే డబ్బును ఇంట్లో సరిగ్గా వినియోగించకపోతే ఎంత మానసిక క్షోభ ఉంటుందో కెనడాలో ఉంటున్న 22 ఏళ్ల ఓ  యువకుడు తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ యువకుడు కుటుంబంలో  సంపాదించే ఏకైక వ్యక్తి. కెనడాలో తన ఖర్చులు పోను ప్రతి నెలా రూ. 70వేలు ఇండియాలోని తన తల్లిదండ్రులకు పంపిస్తున్నాడు.

చిట్టీల పేరుతో డబ్బులు..

కొడుకు పంపుతున్న ఆ డబ్బుతో ఇల్లు గడపాల్సింది పోయి.. తల్లిదండ్రులు అందులోంచి ఏకంగా రూ. 50 వేలు.. ఇందులో తల్లి పై  25 వేలు, తండ్రి పై 25 వేలతో  చిట్టి(చిట్ ఫండ్) కడుతున్నారు. దీన్ని వాళ్ళు ఫిక్స్డ్ సేవింగ్స్ అనుకుంటున్నారు.చిట్టీలకు పోను మిగిలిన రూ. 20,000తో కిరాణా సమన్లు, కరెంట్ బిల్లులు, చెల్లెలి స్కూల్ ఫీజులు కట్టడం వాళ్లకు తలకు మించిన భారమవుతోంది. దింతో డబ్బులు సరిపోక ప్రతి నెలా మళ్లీ కొడుకునే ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నారు. ఈ నెలలో మరో 25 వేలు ఎక్స్ట్రా పంపాల్సి రావడంతో కెనడాలో ఆ యువకుడి బడ్జెట్ తలకిందులైంది.

రూ. 25 లక్షలు ఇవ్వమంటున్నారు
ఈ విధంగా సేవింగ్స్  అనుకుంటూ డబ్బును చిట్టీల పేరుతో వేయడం కరెక్ట్ కాదని, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే  డబ్బు చేతిలో ఉండాలని తల్లిదండ్రులకు ఆ యువకుడు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. అయితే, దీనికి వాళ్ళు రివర్స్ అయి.. నీ చదువు కోసం మేము ఖర్చు చేసిన రూ. 25 లక్షలను వెంటనే వెనక్కి ఇచ్చేయమంటూ బ్లాక్‌మెయిల్లా మాట్లాడుతున్నారని వాపోయాడు. సొంత భవిష్యత్తును పక్కనపెట్టి, కేవలం వారి చిట్టీల డబ్బు కోసమే నేను కష్టపడుతున్నట్లుగా ఉందని ఆవేదన చెందాడు.

దీనిపై రెడ్డిట్ యూజర్ల స్పందనలు
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.  "నువ్వు వెంటనే పంపే డబ్బును తగ్గించుకో. నీకు ఉండే ఖర్చులు ఎక్కువున్నాయని చెప్పి.. చిట్టీలు పేరుతో కట్టే మొత్తాన్ని తగ్గించుకోమ చెప్పు" అని ఒకరు సలహా ఇవ్వగా.... "కెనడాలో బతకడమే కష్టం. పిల్లలను విదేశాలకు పంపిన తల్లిదండ్రులు ఇలా లక్షలు తిరిగి ఇవ్వాలని ఆశించడం తప్పు." అని మరొకరు అనగా... "వాళ్ళు బహుశా చెల్లెలి పెళ్లికో, రిటైర్మెంట్ కో భయపడి ఇలా దాచుకుంటున్నారేమో. కొద్ది రోజులు ఓపికపట్టి, ఆ తర్వాత వేరే సేఫ్  మార్గాల్లో సేవింగ్స్ చేయమని చెప్పు." అని కొందరు సలహాలు ఇస్తున్నారు.