పెబ్బేరు: కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు : కాంగ్రెస్ నాయకులు

పెబ్బేరు: కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు : కాంగ్రెస్ నాయకులు

పెబ్బేరు, వెలుగు : కొల్లాపూర్‌‌‌‌లో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తండ్రి అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో పెబ్బేరుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు ప్రాంతంపై శవ రాజకీయాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఆదివారం పెబ్బేరులో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో పలువురు నేతలు మాట్లాడుతూ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా అంశాలపై కేటీఆర్ తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్ తన ఫామ్‌‌‌‌హౌస్ చుట్టూ ఉన్న భూముల వ్యవహారాలపై త్వరలోనే లెక్కలు తేలుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్మన్​ శ్రీనివాస్​ గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దయాకర్​ రెడ్డి, మాలపల్లె సర్పంచ్​ అశోక్​, మార్కెట్​ యార్డు వైస్​ చైర్మన్​ విజయవర్దన్​ రెడ్డి, నాయకులు రంజిత్​ కుమార్​, సురేందర్​ గౌడ్​, వెంకటేశ్​ సాగర్, యుగంధర్​ రెడ్డి, నరేందర్​, శ్రీహరి, విష్ణు, రాములు, రాజు, ఉత్తమ్​, తదితరులు పాల్గొన్నారు.