ప్రాజెక్ట్‌ ఆర్‌‌జీ రీలాంచ్ విఫలం.. రాహుల్‌ గాంధీపై నడ్డా విమర్శలు

ప్రాజెక్ట్‌ ఆర్‌‌జీ రీలాంచ్ విఫలం.. రాహుల్‌ గాంధీపై నడ్డా విమర్శలు

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంలో ప్రధాని మోడీ, కేంద్ర సర్కార్‌‌పై విమర్శలకు దిగుతున్న రాహల్ గాంధీపై బీజేపీ మండిపడింది. భద్రతా దళాల ఇమేజ్‌కు చేటు చేసేలా రాహుల్ మాట్లాడుతున్నారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా దుయ్యబట్టారు. మోడీ గవర్నమెంట్‌పై రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు ఆర్‌‌జీ (రాహుల్ గాంధీ) రీలాంచ్‌ విఫల ఎడిషన్‌కు రుజువన్నారు.

‘ఇవ్వాళ మనం ప్రాజెక్ట్ ఆర్‌‌జీ రీలాంచ్ మరోసారి విఫలవడం చూశాం. రాహుల్ జీ ఎప్పటిలాగే నిజాల విషయంలో చాలా బలహీనంగా, అబద్ధాల విషయంలో బలవంతుడిగా ఉన్నారు. రక్షణతోపాటు విదేశాంగ విధానాలను రాజకీయం చేసే యత్నాలు.. 1962 నుంచి వారి చరిత్రను కడిగేయడంతోపాటు ఇండియాను బలహీనం చేసిన ఆ రాజవంశపు నిరాశకు అద్దం పడుతోంది’ అని నడ్డా ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో గెలవడం కోసమే ప్రధాని మోడీ నకిలీ బలవంతుడిగా ఇమేజ్‌ను తయారు చేసుకున్నారని రాహుల్ కామెంట్‌కు బదులుగా నడ్డా పైవిధంగా విరుచుకుపడ్డారు.