Actor Arjun daughter Aishwarya Wedding: హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్

Actor Arjun daughter Aishwarya Wedding: హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్

తమిళ స్టార్ అర్జున్(Arjun) పెద్ద కూతురు, నటి ఐశ్వర్య(Aishwarya ) నిశ్చితార్థం గత ఏడాది జరిగిన విషయం తెలిసందే. తమిళ సీనియర్ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి రామయ్య(Umapathi Ramayya)తో గత ఏడాది అక్టోబర్ 27న తమిళనాడులో ఘనంగా జరిగింది. దాదాపు ఏడు నెలల తరువాత వెరీ వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. జూన్ 10న తమిళ, హిందూ, కన్నడ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వేడుక జరుగనుంది. ఈ పెళ్లి చెన్నైలోని పోరూర్‌ అంజనాసుత శ్రీ యోగాంజనేయ మందిరంలో జరుగనుందని సమాచారం. ఎంతో ఘనంగా జరుగనున్న ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల బంధువులు, సినీ ప్రముఖులు పాల్గొననున్నారట.

 ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య విషయానికి వస్తే.. ఆమె 2013లో వచ్చిన పట్టాత్తు యానల్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆతరువాత కూడా కొన్ని సినిమాలు చేశారు ఐశ్వర్య. తెలుగులో కూడా ఆమె ఓ సినిమా చేయాల్సింది. అందుకోసం అర్జున్ తన సొంత నిర్మాణ సంస్థ ఓ సినిమాను స్టార్ చేశాడు. అందులో హీరోగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ను సెలెక్ట్ చేశారు. అధికారికంగా కూడా మొదలయింది ఈ మూవీ. కానీ, ఊహించని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆడిగిపోయింది.