తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో 5 రోజుల పాటు.. 2024, మే 8వ తేదీ నుంచి 14వ తేదీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో మే 8వ తేదీ అంటే బుధవారం సాయంత్రం భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు  కురిసే ఛాన్స్ అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ  జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30-40 కిలో మీటర్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.