అయ్యో పాపం : ఏనుగు దాడిలో న్యూస్ ఛానల్ కెమెరామెన్ మృతి

అయ్యో పాపం : ఏనుగు దాడిలో న్యూస్ ఛానల్ కెమెరామెన్ మృతి

కేరళలో దారుణం జరిగింది. మలయాళంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు చెందిన 34 ఏళ్ల కెమెరామెన్ బుధవారం పాలక్కాడ్ జిల్లాలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అడవి ఏనుగు అతడిపై దాడి చేసింది. ఈ క్రమంలోనే కెమెరమాన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే మాతృభూమి న్యూస్‌లో పనిచేస్తున్న ఏవి ముఖేష్ రిపోర్టర్, కెమెరామాన్ ఇద్దరు రం పాలక్కాడ్ జిల్లాలోని మలంబుజా, కంజికోడ్ మధ్య ఉన్న ఒక ప్రదేశంలో జంబోస్ నదిని వద్ద రిపోర్టింగ్ చేద్దామని వెళ్లారు.

 ఈ క్రమంలోనే దారితప్పిన ఏనుగుల గుంపు ఉన్న దగ్గరకి వెళ్లారు. ఏనుగులు ఇరువురిపై తీవ్రంగా దాడి చేశాయి.  ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కెమెరామెన్ మృతి చెందాడు. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

స్థానికులు దీనిపై స్పందిస్తూ అడవి ఏనుగులు వస్తున్నప్పుడు రిపోర్టర్ కారు డ్రైవర్ సురక్షితంగా పారిపోయారని కెమెరామాన్ ముఖేష్‌ ఒక్కడు అక్కడే చిక్కుకపోవడంతో ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయని తెలిపారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడని వెల్లడించారు. కెమెరామెన్ మృతి పట్ల ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, మంత్రులు ఏకే శశీంద్రన్, ఎంబీ రాజేష్, సాజీ చెరియన్ తదితరులు సంతాపం తెలిపారు.