
కాంగ్రెస్ లో చేరినందుకే తమపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు నార్సింగి మున్సిపాలిటీ కౌన్సిలర్లు శివారెడ్డి, సునీతా గణేష్, పత్తి ప్రవీణ్. మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లను అవినీతి కారణంగానే గద్దె దించామని తెలిపారు. గండిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ లో చేరామంటున్నారని.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోయామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కాంగ్రెస్ లో చేరినట్టు వారు తెలిపారు.