
ఇటీవల ఓటీటీకి వచ్చిన కొత్త మూవీ మై డియర్ దొంగ(My Dear Donga). ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమఠం(Abhinav Gomatam) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాలో శాలిని కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ తదితరులు కీ రోల్స్ చేశారు. బీఎస్ సర్వజ్ఞ కుమార్ దర్శకత్వం ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈనెల (ఏప్రిల్) 19 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఫుల్ ఆన్ ఫన్ రైడ్ గా వచ్చిన ఈ సినిమాకు మొదటిరోజు నుండే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను చేసుందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆహా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది ఈ సినిమా.
తాజాగా ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ దాటేసిందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. “100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఇంకా కౌంటింగ్. ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా మీ మనసులను, స్క్రీన్ టైమ్‍ను మై డియర్ దొంగ దోచేస్తున్నాడు” అని ఆహా ట్వీట్ చేసింది. దీంతో ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందనకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
100 Million streaming minutes and counting! ?? My Dear Donga is stealing hearts and screen time like never before!
— ahavideoin (@ahavideoIN) May 18, 2024
Watch #MyDearDongaOnAha streaming now! ▶️https://t.co/rRYqxjU8xg @AbhinavGomatam #camentertainment #divyasripada #shalinikondepudi @sprite_india pic.twitter.com/FdS70Ra5yv
ఇక మై డియర్ దొంగ మూవీ కథ విషయానికి వస్తే..లవర్, బెస్ట్ ఫ్రెండ్స్ వదిలేసిన ఒక అమ్మాయికి ఒక దొంగతో పరిచయం అవుతుంది. ఆమె ఆ దొంగతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. మరి ఆ దొంగ ఎవరు? ఆ అమ్మాయి దొంగతో స్నేహం ఎందుకు చేసింది? వారి స్నేహం వళ్ళ ఏర్పడ్డ పరిస్థితులు ఏంటి? అనేది మిగిలిన కథ. వీలుంటే మీరు కూడా చూసేయండి.
అభినవ్ గోమటం సినిమాలు చూసుకుంటే..
2014లో వచ్చిన మైనే ప్యార్ కియా మూవీతో ఎంట్రీ ఇచ్చిన..2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని కౌశిక్ పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.అలాగే తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం హిలేరియస్‌గా అతడి క్యారెక్టర్ నవ్వించింది. అలాగే ఈ మధ్య కాలంలో అభినవ్ సినిమాలు చూసుకుంటే..మీకు మాత్రమే చెప్తా,శ్యామ్ సింగరాయ్‌తో,విరూపాక్షతో పాటు పలు సినిమాలు చేశాడు.ఇక రీసెంట్గా ఓటీటీలో వచ్చిన సేవ్ ది టైగర్స్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు.