లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బట్టు శ్రీరాములు (45) ఇంజాపూర్ లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

ఆదివారం నగరం నుండి కోదాస్ పల్లిలోని తన సోదరి వద్దకు వెళుతుండగా.. రంగాపూర్ గ్రామం దాటి లోయపల్లికి వెళ్లే రోడ్డు వద్దకు చేరుకోగానే వెనక నుండి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.